Movie News

గదర్-2.. సన్నీ కాకుంటే తారకేనట

కొన్ని వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సినిమా ‘గదర్-2’. రెండు దశాబ్దాల కిందట ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’కు కొనసాగింపుగా ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ తీశాడు దర్శక నిర్మాత అనిల్ శర్మ. పూర్తిగా ఔట్ డేట్ అయిపోయిన సన్నీ డియోల్‌ను పెట్టి ఇన్నేళ్ల తర్వాత ఓ సినిమాకు సీక్వెల్ తీస్తే జనాలు ఏం పట్టించుకుంటారులే అనుకున్నారు చాలామంది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్నందుకుంది. తొలి రోజు నుంచి భారీ వసూళ్లతో దూసుకెళ్తూ.. ఇండియా వరకే ఏకంగా ఐదొందల కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.

రిలీజైన మూడో వారంలో కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. బాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది ‘గదర్-2’. ‘గదర్’ తర్వాత సన్నీకి దక్కిన హిట్ ఇదే కావడం విశేషం. తారా సింగ్‌‌గా సన్నీ పెర్ఫామెన్స్ హిందీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. తారా సింగ్ పాత్ర కేవలం సన్నీ కోసమే పుట్టిందనే అభిప్రాయాలు ప్రేక్షకుల నుంచి వ్యక్తమయ్యాయి. కాగా ఒక ఇంటర్వ్యూలో సన్నీ కాకుండా తారా సింగ్ పాత్రను బాలీవుడ్లో ఇంకెవరు చేయగలరు అని దర్శక నిర్మాత అనిల్ శర్మను అడిగితే.. ఆయనకు ఏ ఛాయిస్ కనిపించలేదు.

బాలీవుడ్లో ఇంకెవ్వరూ తారా సింగ్ పాత్రను పోషించలేరని ఆయన తేల్చి చెప్పారు. కానీ సౌత్ ఇండియాలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడు ఆ పాత్ర చేయగలడని ఆయన వ్యాఖ్యానించారు. బహుశా ‘ఆర్ఆర్ఆర్’లో తారక్ పెర్ఫామెన్స్ చూశాక తారా సింగ్‌ పాత్రను తారక్ చేయగలడని అనిల్‌కు అనిపించి ఉండొచ్చు. ఒక భారీ బ్లాక్ బస్టర్ తీసిన వేరే ఇండస్ట్రీ డైరెక్టర్.. ఈ స్టేట్మెంట్ ఇవ్వడంతో తారక్ అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. ఇదీ తారక్ రేంజ్ అంటూ ఎలివేషన్లు ఇస్తున్నారు. తారక్ త్వరలోనే ‘వార్-2’తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

This post was last modified on September 3, 2023 8:00 pm

Share

Recent Posts

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

17 minutes ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

1 hour ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

2 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

4 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

4 hours ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

4 hours ago