మాములుగా వరస డిజాస్టర్లు అప్ కమింగ్ హీరోల మార్కెట్ ని ప్రభావితం చేయడం సహజమే. క్రమంగా బిజినెస్ హెచ్చుతగ్గుల్లో మార్పులు వచ్చేస్తాయి. విజయ్ దేవరకొండకూ ఆ టెన్షన్ లేకపోలేదు. ఎందుకంటే లైగర్ కొట్టిన దెబ్బ అలాంటిది. అయితే దాని ప్రభావం ఎంత మాత్రం లేదని, సరైన కథ దర్శకుడు దొరికితే ఫామ్ లోకి రావడం పెద్ద కష్టం కాదని ఖుషి నిరూపించింది. రెండు రోజులకే వరల్డ్ వైడ్ 50 కోట్ల గ్రాస్ దాటేయడమే కాక యుఎస్ లో వేగంగా 1 మిలియన్ డాలర్ మార్క్ అందుకున్న సినిమాల్లో చోటు సంపాదించుకుని మరో రికార్డుని ఖాతాలో గర్వంగా వేసుకుంది.
ఆదివారం బుకింగ్స్ చాలా బాగున్నాయి. వీకెండ్ కాబట్టి జోరు కొనసాగడం సహజమే కానీ సోమవారం నుంచి డ్రాప్ ఎంత శాతం ఉండబోతోందనేది కీలకంగా మారనుంది. సెప్టెంబర్ 7 జవాన్ వస్తున్న నేపథ్యంలో ఆడియన్స్ దృష్టి క్రమంగా దానివైపు వెళ్తోంది. అయితే కుటుంబ ప్రేక్షకులు మాత్రం ఖుషి వైపే మొగ్గు చూపుతున్నారు. గీత గోవిందం రేంజ్ లో సంచలనాలు నమోదు చేయడం కష్టమే కానీ ఆశించిన స్థాయి కన్నా బెటర్ రిజల్ట్ దక్కిన మాట వాస్తవం. టీమ్ మొత్తం యాదాద్రిలో దర్శనం చేసుకున్నాక సంధ్య థియేటర్ నుంచి సక్సెస్ టూర్ మొదలుపెట్టింది.
సో విజయ్ దేవరకొండ ఇకపై వరల్డ్ ఫేమస్ లవర్ లాగా కాకుండా పక్కింటి కుర్రాడిలా కనిపిస్తేనే పబ్లిక్ సొంతం చేసుకుంటారనే క్లారిటీ వచ్చిందిగా. ప్రమోషన్లకు సమంతా అందుబాటులో లేకపోయినా విజయ్ మొత్తం తన భుజాల మీద వేసుకుని అంతా తానై ఇంటర్వ్యూలు గట్రా చూసుకున్నాడు. ఖుషి ఇండస్ట్రీ హిట్ అనిపించుకోకపోయినా చాలా గ్యాప్ తర్వాత వచ్చిన విజయం కావడంతో ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉన్నాడు.. దర్శకుడు శివ నిర్వాణ కథనం విషయంలో ఇంకాస్త శ్రద్ధ వచ్చింది ఉంటే ఖుషి నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళేదన్న కామెంట్ ని ఎంత మాత్రం కొట్టిపారేయలేం.
This post was last modified on September 3, 2023 5:47 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…