పుష్ప టీంకి చుక్కలు చూపించాడు!

తమిళ నటుడు విజయ్ సేతుపతి ‘ఉప్పెన’ చిత్రంలో నటించడంతో… ఆ చిత్రానికి నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ అతడినే పుష్పలో కూడా విలన్ గా ఖరారు చేసారు. విజయ్ సేతుపతికి తమిళంలో పాపులారిటీ ఉంది కనుక పాన్ ఇండియా అప్పీల్ కి బాగుంటుందని అనుకున్నారు. అయితే విజయ్ సేతుపతి విచిత్రమైన కండిషన్స్ పెట్టాడట.

తమిళంలో రిలీజ్ చేయకూడదని, ఒకవేళ చేస్తే తన పాత్ర వేరే నటుడితో తమిళ్ లో చేయించాలని, అలాగే ఇది పాన్ ఇండియా సినిమా కనుక, రేంజ్ పెద్దది కనుక పారితోషికం కూడా పది కోట్లు ఇవ్వాలని ఆటను పెద్ద లిస్ట్ చెప్పాడట. దాంతో అతనికి బదులుగా ఎవరైతే బాగుంటుందని అన్వేషిస్తున్నారు.

అయితే విజయ్ సేతుపతి వైపే అల్లు అర్జున్ మొగ్గుతున్నాడు కనుక అతనితోనే మంతనాలు జరిపి దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఉప్పెన తమిళ్ లో రిలీజ్ చేయరని మాట ఇచ్చిన తర్వాతే విజయ్ సేతుపతి ఆ సినిమా ఒప్పుకున్నాడు. పుష్ప పాన్ ఇండియా అనేసరికి అతను తమిళంలో తన హీరో ఇమేజ్ కి దెబ్బ అని ససేమీరా అంటున్నాడు.