అనుష్కకి పాన్ ఇండియా లెవెల్ లో మంచి స్టార్డం ఉంది. ఆమె చేసిన బడా సినిమాలు పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు నమోదు చేయడంతో ఆమెకి ఎనలేని క్రేజ్ దక్కింది. ముఖ్యంగా బాహుబలి ఫ్రాంచైజ్ అనుష్క ను బిగ్గెస్ట్ స్టార్ గా మార్చేసింది. అయితే అంతటి క్రేజ్ అందుకున్న స్వీటీ అలియాస్ ఆనుష్క చాలా గ్యాప్ తీసుకొని నవీన్ పోలిశెట్టి తో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చేసింది. అయితే సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన స్వీటీ అదే ఫిజిక్ కంటిన్యూ చేసింది. ఈ సినిమా టైమ్ లో కూడా ఓవర్ వెయిట్ అయిపోయింది అనుష్క.
రీసెంట్ గా రిలీజైన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ లో కూడా అనుష్క బాగా బొద్దుగా కనిపించింది. దీంతో అనుష్క లుక్ పై ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అనుష్క ఈ సినిమా ప్రమోషన్స్ లో కనిపించకపోవడానికి రీజన్ కూడా ఇదే అని తెలుస్తుంది. ఓవర్ వెయిట్ తగ్గాక ప్రమోషన్స్ లో కనిపించాలని చూసిన అనుష్క కి ఆ పని సాధ్యం అవ్వలేదని తెలుస్తుంది. దీంతో ఆ రీజన్ తోనే స్వీటీ ఎక్కడా కనిపించకుండా ప్రమోషన్ లో తన మాటలు మాత్రమే వినిపిస్తుంది.
ఇక అనుష్క యోగా టీచర్. అందులో ఆమెది అందె వేసిన చేయి. మరి యోగాతో బరువు తగ్గడం , ఆరోగ్యంగా ఉండటం చాలా సులువే. అయినా అనుష్క ఎందుకు తగ్గలేకపోయిందో ఆమెకే తెలియాలి. ఏదేమైనా అనుష్క ప్రమోషన్స్ లో కనిపించకపోవడంతో సినిమాపై హైప్ తెచ్చే భాద్యతంతా హీరో నవీన్ పైనే పడింది. తాజాగా కథవర్ అనే పాన్ ఇండియా సినిమాకి సైన్ చేసింది. మరి ఆ సినిమాలో అయినా స్వీట్ స్లిమ్ లుక్ తో దర్శనమిస్తుందా ?
This post was last modified on September 1, 2023 12:56 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…