సింహం నాలుగడుగులు వెనక్కు వేసేది భయపడి కాదు పంజా విసిరేందుకని సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ జైలర్ సక్సెస్ చూసి తెగ మురిసిపోతున్నారు. తమిళంలో విజయం సాధించడం పెద్ద విశేషం కాదు కానీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ నుంచి ఏకంగా 30 కోట్ల లాభం కళ్లజూడటం అనేది కనివిని ఎరుగని రికార్డు. రెండు వారాలు మాత్రమే పూర్తి చేసుకున్న జైలర్ కేవలం పదమూడు రోజులకే 42 కోట్ల పైచిలుకు షేర్ సాధించి ఆమ్మో అనిపించేసింది. రేపు ఎల్లుండి కొత్త రిలీజులు చాలా ఉన్నా అంత సులభంగా తలైవా స్పీడ్ కి బ్రేకులు వేయడం కష్టమని బయ్యర్లు అంచనా వేస్తున్నారు.
ఇంత భారీ మొత్తంతో లాభాల బాట పట్టిన మొదటి అనువాద చిత్రంగా జైలర్ సరికొత్ రికార్డుని తన పేరిట రాసుకుంది. కెజిఎఫ్ 2 ఉంది కదానే డౌట్ రావొచ్చు. కానీ ఆ ప్యాన్ ఇండియా మూవీకి జరిగిన తెలుగు బిజినెస్ 84 కోట్ల దాకా ఉంది. వసూలైన షేర్ 103 కోట్లు. అంటే ఫైనల్ రన్ పూర్తయ్యాక దానికి వచ్చిన మొత్తం లాభం పాతిక కోట్ల లోపే ఉంది. ఇంకా జైలర్ కొనసాగుతోంది. సెప్టెంబర్ మొదటి వారం వరకు జోరు అంత ఈజీగా తగ్గదు. ఏపీ తెలంగాణ హక్కులను కేవలం 12 కోట్లకు అమ్మడం వల్ల దీని బిజినెస్ లో భాగం పంచుకునే వాళ్లందరికీ భారీ కనక వర్షం కురిసింది.
ఇంత పెద్ద స్థాయిలో రజిని కంబ్యాక్ ఇవ్వడం గొప్ప విషయం. ఒకప్పుడు ఆయన సినిమాలు బాషా, నరసింహా, అరుణాచలం, దళపతి లాంటివి మన స్ట్రెయిట్ మూవీస్ తో పోటీ పడుతూ బ్లాక్ బస్టర్ కలెక్షన్లు కొల్లగొట్టాయి. రోబో, 2.0లు ఎంత కలెక్ట్ చేసినా వాటికి జరిగిన బిజినెస్, వచ్చిన బ్రేక్ ఈవెన్, ఆపై అందుకున్న లాభాల నిష్పత్తి చూస్తే జైలర్ వీటన్నిటి కన్నా పై మెట్టులో నిలుస్తోంది. రాబోయే లియో లాంటి వాటికి రజని ఒక కొత్త సవాల్ విసిరినట్టే. అయితే ఇంత మొత్తం ప్రాఫిట్ తో ఈ రికార్డుని బ్రేక్ చేయడం మాత్రం అంత సులభంగా ఉండదు. పెరిగిన మార్కెట్ దృష్ట్యా అసలు సూపర్ స్టార్ కే సాధ్యం కాదేమో.
This post was last modified on August 28, 2023 6:40 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…