కరోనా బారిన పడి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరితే అగ్ని ప్రమాదం జరిగి పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఉదంతం విజయవాడలో ఎంతటి విషాదం నింపిందో తెలిసిందే. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సైతం ఇలాంటి దారుణమే ఒకటి జరిగింది. ఇప్పుడు ఇలాగే కరోనా చికిత్స కోసం వెళ్తుంటే జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు ప్రాణాలు కోల్పోయిన విషాదాంతం ఏపీలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి టాలీవుడ్ నిర్మాత కావడం గమనార్హం. ఆయన పేరు.. కమలాకర్ రెడ్డి. ఆయన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘కనులు కనులను దోచాయంటే’ తెలుగు వెర్షన్‌కు నిర్మాత. ఆయనది నెల్లూరు జిల్లా.
కమలాకర్ తండ్రి కొన్ని రోజుల కిందట కరోనా బారిన పడ్డారు. ఆయన పరిస్థితి విషమించడంతో నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు తరలించాల్సి వచ్చింది. దీంతో అంబులెన్సు మాట్లాడుకుని తండ్రితో కలిసి కమలాకర్‌రెడ్డి కూడా హైదరాబాద్ బయల్దేరాడు. ఐతే మార్గ మధ్యంలో భారీ వర్షం కారణంగా అంబులెన్సు అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో కమలాకర్‌రెడ్డితో పాటు ఆయన తండ్రి అక్కడిక్కడే మృతి చెందారు. అంబులెన్స్ డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉంది. కరోనా నుంచి తండ్రిని కాపాడుకుందామనుకుంటే.. ఇలా ఆయనతో పాటు కమలాకర్ కూడా ప్రాణాలు కోల్పోవడం విషాదం. లాక్‌డౌన్ ముంగిట విడుదలైన ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రం మంచి విజయం సాధించింది. లాక్ డౌన్ టైంలో ఆన్ లైన్లో ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో ఆర్థికంగా మంచి లాభాలే అందుకున్నారు కమలాకర్ రెడ్డి.
This post was last modified on August 19, 2020 8:26 pm
గత నెల సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి పైరసీకి గురి కావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు…
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…
ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…
పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…