మాములుగా విజయ్ దేవరకొండ ఏదైనా ఈవెంట్ లేదా తన సినిమాకు సంబందించిన ప్రెస్ మీట్లలో ఇతర హీరోల ప్రస్తావన రాకుండా చూసుకుంటాడు. కానీ సీనియర్ల విషయంలో మాత్రం దానికి మినహాయింపు ఇచ్చేశారు. ఖుషి ప్రమోషన్ల కోసం తమిళనాడు, కేరళ ట్రిప్ కు వెళ్లిన రౌడీ హీరోకు అక్కడ చిరంజీవి, రజనీకాంత్ ల గురించిన ప్రస్తావన వచ్చింది. ఆరేడు వరస ఫ్లాపులు వచ్చినా వాళ్ళ స్టార్ డం చెక్కు చెదరదని, ఎన్నో చూసిన శిఖరాలు కాబట్టే కేవలం సక్సెస్ ఫెయిల్యూర్ ని బట్టి అంచనా వేయడం ఎంత మాత్రం సరికాదని చాలా స్పష్టంగా వివరించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు.
ముఖ్యంగా భోళా శంకర్ డిజాస్టర్ గురించి సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ జరిగిన నేపథ్యంలో విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా మెగాస్టార్ గురించి అన్న మాటలు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి వచ్చాక తెలుగు సినిమా గమనం మారిందని, అప్పటి దాకా ఒక లెక్కలో ఉన్న పరిశ్రమ వేగం ఇంకో స్థాయికి వెళ్లిందని, అంతే తప్ప కేవలం ఫలితాల ఆధారంగా వాళ్ళ స్థాయిని నిర్ణయించడం తగదని హితవు పలికాడు. జైలర్ 500 కోట్లు వసూలు చేసినప్పుడు అందరూ నోరు మూసుకుని చూశామని అది వాళ్ళ స్టామినా అని పొగడ్తల వర్షం కురిపించడం చూసి తమిళ తెలుగు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి రౌడీ హీరో చెప్పిన విధానం అందరినీ ఆకట్టుకుంది. కేవలం ఖుషి గురించి కాకుండా ఇతర ప్రశ్నలు ఎదురైనప్పుడు కూడా ఇది సబ్జెక్టు కాదు, సందర్భం కాదు అని తప్పించుకోవడం లేదు. సెప్టెంబర్ 1 విడుదల కాబోతున్న ఖుషి పబ్లిసిటీ విషయంలో భారం మొత్తం విజయ్ మీదే పడింది. ఆరోగ్య రిత్యా సమంతా మళ్ళీ మళ్ళీ మీడియా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అందుకే మ్యూజికల్ కన్సర్ట్ కి వచ్చి లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చి యుఎస్ వెళ్లిపోయింది. ఇప్పుడు అన్ని బాషల ఈవెంట్లు, ప్రెస్ మీట్లు విజయ్ దేవరకొండనే చూసుకోవాలి. హేశం వహాబ్, శివ నిర్వాణలు ఫైనల్ కాపీ పనుల్లో బిజీగా ఉన్నారు.
This post was last modified on August 22, 2023 11:45 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…