విజయ్ దేవరకొండ , సమంత లతో శివ నిర్వాణ తీసిన ‘ఖుషి’ సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే టీజర్ , ట్రైలర్ బజ్ తీసుకొచ్చాయి. హీషమ్ సాంగ్స్ సినిమాకు మంచి హైప్ తెచ్చాయి. ప్రస్తుతం విజయ్ ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోట్ చేసే పనిలో ఉన్నాడు. వివిధ ప్రదేశాలు తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. అయితే ట్రైలర్ రాక ముందే ఈ సినిమా కథపై అనేక సందేహాలున్నాయి. ఎప్పుడైతే ట్రైలర్ వచ్చిందో అక్కడి నుండి ఈ సినిమాను ఆల్రెడీ వచ్చిన సినిమాలతో పొలుస్తూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు నెటిజన్లు.
ఖుషిలో శివ నిర్వాణ చెప్తుంది కొత్త కథ అయితే కాదు. ఈ మధ్యే వచ్చిన నాని ‘అంటే సుందరనికీ’ అలాగే నాగ శౌర్య ‘కృష్ణ వ్రింద విహరి’ తో ‘ఖుషి’ కి పోలికలు కనిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాళ్లో మతాంతర వివాహం కామన్ పాయింట్, ఇక బ్రాహ్మణ అబ్బాయి పెళ్లి తర్వాత ఆ అమ్మాయితో పడే ఇబ్బందులన్నే ‘కృష్ణ వ్రింద విహరి’ లో చూపించారు.
బ్రాహ్మణ కుటుంబం , పెళ్లి తర్వాత సమస్యలు మూడింటిలో కామన్. కాకపోతే అందులో హీరో బ్రాహ్మణ అబ్బాయిలా కనిపిస్తే, ఇందులో హీరోయిన్ బ్రాహ్మిన్ గా కనిపిస్తుంది అంతే తేడా. ఏదేమైనా నాని , నాగ శౌర్య నటించిన ఆ రెండు సినిమాలు డిజాస్టర్స్ అనిపించుకున్నాయి. మరి కథ పరంగా అదే కోవలో కొచ్చే ఖుషి అక్కడ నెగ్గుతుందో లేదో వేచి చూడాలి. లైగర్ తో పాన్ ఇండియా డిజాస్టర్ అందుకున్న విజయ్ కి ఈ సినిమా సక్సెస్ చాలా ముఖ్యం. అలాగే టక్ జగదీష్ తో బాగా నిరాశ పరిచిన దర్శకుడు శివను కూడా ఈ సినిమా సక్సెస్ ఖుషి చేయాల్సి ఉంది.
This post was last modified on August 22, 2023 12:11 am
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…
నెలలో ఒక్కరోజు గ్రామీణ ప్రాంతాలకు రావాలని.. ఇక్కడి వారికి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…