ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌లో రెండు సినిమాలదే హవా. దక్షిణాదిన అంతటా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా జైలర్ వసూళ్ల మోత మోగిస్తుంటే.. ఉత్తరాదిన గదర్-2 కలెక్షన్లు కుమ్మేస్తోంది. చాలా ఏళ్లుగా అసలేమాత్రం లైమ్ లైట్లో లేని సన్నీ డియోల్ హీరోగా.. 20 ఏళ్ల కిందటి గదర్ సినిమాకు సీక్వెల్ తీస్తే జనం విరగబడి చూస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే రూ.300 కోట్ల దాకా వసూళ్లు కొల్లగొట్టింది.
ఉత్తరాదిన మాస్ ఏరియాల్లో ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సక్సెస్‌తో సన్నీ మామూలు ఆనందంలో లేడు. కానీ ఈ ఆనందంలో అతను లగాన్ లాంటి మైల్ స్టోన్ మూవీ గురించి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. ఒకప్పుడు గదర్, లగాన్ సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. కంటెంట్ పరంగా లగాన్‌యే గొప్ప సినిమా అయినా… కలెక్షన్లలో గదర్‌యే పైచేయి సాధించింది.
అప్పట్లో లగాన్ రూ.70 కోట్ల దాకా వసూళ్లు రాబట్టగా.. గదర్ రూ.130 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఐతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో సన్నీ మాట్లాడుతూ.. లగాన్ మంచి సినిమా అంటూనే తన గదర్ సినిమాతో పోలిస్తే అది 2 నుంచి 5 శాతం బిజినెస్ మాత్రమే చేసిందని పేర్కొనడం గమనార్హం. గదర్‌కు, లగాన్‌కు పోలిక పెట్టడం తనకు నచ్చదని… తాను పోటీ గురించి అసలు పట్టించుకోనని సన్నీ అన్నాడు.
కొన్ని సినిమాల్లో స్టార్ కాస్టింగ్ పెట్టుకుని.. ప్రమోషన్ల విషయంలో బాగా హడావుడి చేస్తారని.. కానీ తాను అలాంటివి అస్సలు నమ్మనని సన్నీ అన్నాడు. అప్పుడు లగాన్ మీద గదర్ పైచేయి సాధించగా.. ఇప్పుడు ఓఎంజీ-2ను వెనక్కి నెట్టి గదర్-2 భారీ విజయం సాధించింది. ఓఎంజీ-2 వసూళ్లు రూ.90 కోట్లకు చేరువగా ఉండగా.. దానికంటే 3 రెట్లకు పైగా గదర్-2 కలెక్షన్లు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే పోటీ గురించి మాట్లాడుతూ.. లగాన్ మూవీని మరీ తక్కువ చేసి మాట్లాడాడు సన్నీ.
This post was last modified on August 20, 2023 1:58 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…