ఏది ఏమైనా భోళా శంకర్ ఫలితం తేలిపోయింది. కాస్తో కూస్తో ఆశలున్న మొన్నటి వీకెండ్, ఇవాళ్టి ఇండిపెండెన్స్ డే రెండూ నిరాశ కలిగించే వసూళ్లు నమోదు చేయడంతో ఇక ఎదురు చూసేందుకు ఏమీ లేకపోయింది. ఎంత నష్టం మిగులుతుందనే లెక్కలు బయ్యర్లని భయపెడుతున్నాయి. సరే కలెక్షన్ల సంగతి పక్కనపెడితే ఈ మెగా మూవీ రీమేక్ విషయంలో చిరంజీవి తీసుకున్న నిర్ణయం ఒకరకంగా కరెక్టే అయినా స్క్రిప్ట్ అండ్ స్టోరీపరంగా చేసిన రెండు కీలక తప్పులు చాలా ప్రభావం చూపించాయన్న వాస్తవాన్ని తేట తెల్లం చేస్తున్నాయి. రెండు వెర్షన్లు చూసిన వాళ్ళ అభిప్రాయం కూడా ఇదే.
వేదాళం ఒరిజినల్ వెర్షన్ లో అజిత్ కు చెల్లిగా నటించిన అమ్మాయి లక్ష్మి మీనన్. డీ గ్లామర్ లుక్ తో నటనే బలంగా ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చిన టైంలో ఈ అవకాశం తనకు చాలా ఉపయోగపడింది. కానీ మనదగ్గరకు వచ్చేసరికి ఇటు గ్లామర్ అటు ఫిమేల్ ఓరియెంటెడ్ రెండూ చేస్తున్న కీర్త్ సురేష్ ని తీసుకోవడంతో ప్రేక్షకుల మనసులో సానుభూతి ఏర్పడలేదు. పైగా మేకప్, కాస్ట్యూమ్స్ గట్రా రిచ్ గా పెట్టారు. వేదాళంలో లక్ష్మి తల్లితండ్రులకు చూపు ఉండదు. నోటెడ్ ఆర్టిస్టులను పెట్టలేదు. ఆ సింపతీ ఎమోషన్ల పరంగా ఆడియన్స్ ని బాగా కనెక్ట్ చేసింది.
తీరా మనదగ్గర చూస్తే మురళీశర్మ జంటగా రిచ్ క్యాస్టింగ్ ని పెట్టుకున్నారు. కట్టు బొట్టు అన్నీ ఎగువ మధ్య తరగతి అనేలా చూపించారు. దీంతో సహజంగానే ఎంత అమాయకంగా నటించినా ఈ పాయింట్ సరిగా రిజిస్టర్ కాలేదు. ఈ కుటుంబానికి అండగా అజిత్ నిలవడం అక్కడ ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ అయితే తెలుగులో మాత్రం పై రెండు కారాణాల వల్ల తేడా కొట్టింది. పైగా భోళా చుట్టూ జబర్దస్త్ గ్యాంగుతో పెట్టిన అత్తెసరు జోకులు మరింత డ్యామేజ్ చేశాయి. నలుగురు అనుభవమున్న రచయితలు ఈ అంశాల మీద సీరియస్ గా వర్క్ చేయకపోవడం వల్ల వచ్చిన ముప్పిది.
This post was last modified on August 15, 2023 7:09 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…