సూపర్ స్టార్ రజినీకాంత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ హీరోల్లో ఒకడు. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్, వసూళ్ల పరంగా ఆయన ఎవ్వరూ అందుకోలేని ఎత్తులకు వెళ్లారు. ఐతే సినిమాల్లో ఎంత సాధించినా.. బయట మాత్రం ఆయన ఎంత వినమ్రంగా ఉంటారో తెలిసిందే. ఏమాత్రం అహంకారం లేకుండా.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆయన వ్యక్తిత్వం జనాల్లో మరింత అభిమానం పెంచింది.
ఓవైపు ‘జైలర్’ సినిమా వసూళ్ల మోత మోగిస్తూ బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తుంటే.. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేయకుండా హిమాలయాల పర్యటనకు వెళ్లిపోవడం రజినీకే చెల్లింది. అక్కడ ఆయన అతి సామాన్యుడిలా ఉండటానికి ప్రయత్నిస్తారన్న సంగతి తెలిసిందే. తన సినిమాల షూటింగ్ స్పాట్లోనూ రజినీ మెలిగే తీరు గురించి కథలు కథలుగా చెబుతుంటారు సినీ జనాలు. తాజాగా రజినీ గొప్పదనాన్ని చాటే ఒక ఉదంతం బయటికి వచ్చింది.
‘జైలర్’ షూటింగ్ సందర్భంగా ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే జైల్ ఎపిసోడ్ కోసం ఒక జూనియర్ ఆర్టిస్టును తీసుకొచ్చారట. ఐతే షూట్ టైంలో అతడి పెర్ఫామెన్స్ ఎవ్వరికీ నచ్చలేదట. అతడి వల్ల సీన్ డిస్టర్బ్ అవుతోందని పక్కన పెట్టేశారట. ఐతే షాట్ గ్యాప్‌లో రజినీ ఈ విషయం గమనించి.. ఆ జూనియర్ ఆర్టిస్ట్ గురించి బాధపడ్డారట.
రజినీతో నటిస్తున్నా అని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చెప్పి వచ్చి ఉంటాడు.. ఇప్పుడు మనం తీసేస్తే అతడికి ఇబ్బంది కదా అని చెప్పి.. తర్వాతి సీన్లోకి అతణ్ని తీసుకోమని చెప్పి.. అతను నటించే అవసరం లేకుండానే.. ఊరికే ఆ నటుడి భుజం మీద చేయి వాల్చి డైలాగ్ చెప్పేలా సీన్లో చిన్న మార్పు చేయించారట సూపర్ స్టార్. ఈ విషయాన్ని ‘జైలర్’ ఆడియో వేడుకలోనే టీంలోని ఒక వ్యక్తి స్టేజ్ మీద చాలా ఎమోషనల్ అవుతూ వెల్లడించాడు. ఇప్పుడు సినిమాలో సదరు సన్నివేశంలో ఆ జూనియర్ ఆర్టిస్ట్‌ను ఐడెంటిఫై చేసిన నెటిజన్లు.. ఆ స్పీచ్ వీడియోకు, ఈ ఫొటోను జోడించి దటీజ్ రజినీ అంటూ ఆయన గొప్పదనాన్ని కొనియాడుతున్నారు.
This post was last modified on August 12, 2023 4:07 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…