ఈ మధ్య ఏదైనా భాషలో బ్లాక్ బస్టర్ అయిన సినిమా ఎక్కడ తెలుగులో రీమేక్ చేసి చెడగొడతారోననే భయం మూవీ లవర్స్ కు పట్టుకుంది. ఇటీవలే మెగా బ్రదర్స్ పవన్ చిరు ఇద్దరూ బ్రో, భోళా శంకర్ రూపంలో ఎలాంటి ఫలితం అందుకున్నారో కళ్లారా చూశాం. కొద్దివారాల క్రితం కన్నడలో సెన్సేషనల్ హిట్ అందుకున్న హాస్టల్ హుడుగురు బేకాగిద్దరేకు హక్కుల పరంగా మంచి డిమాండ్ అందుకుంది. అయితే ఒరిజినల్ వెర్షన్ తిరిగి పునః సృష్టించడం అసాధ్యమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇది రీమేక్ లా కాకుండా హాస్టల్ బాయ్స్ పేరుతో డబ్బింగ్ రూపంలో విడుదల చేస్తున్నారు.
ఆగస్ట్ 25న హాస్టల్ బాయ్స్ రిలీజ్ అవుతోంది. తల్లితండ్రులకు దూరంగా హాస్టల్ లో ఉండే కుర్రాళ్ళ మధ్య జరిగే సంఘటనలు చిన్న కామెడీ క్రైమ్ తో ముడిపెట్టి నవ్వించడమే లక్ష్యంగా దీన్ని రూపొందించిన తీరు శాండల్ వుడ్ లో వసూళ్ల వర్షం కురిపించింది. హైదరాబాద్ లో అదే భాషలో షోలు వేస్తే రెండు వారాలకు పైగానే హౌస్ ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి. అందుకే ఇప్పుడు నేరుగా మన ఆడియన్స్ కోసం తెలుగులో తీసుకురాబోతున్నారు. నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ఈ ఎంటర్ టైనర్ ని అన్నపూర్ణ, ఛాయ్ బిస్కెట్ లతో కలిపి అయిదు సంస్థలు సంయుక్తంగా అందిస్తున్నాయి.
వచ్చే వారం చెప్పుకోదగ్గ రిలీజులు లేవు కాబట్టి ఆగస్ట్ 25 ఈ సినిమాకు మంచి ఛాన్స్ ఉంటుంది కానీ పోటీ మాత్రం చాలా తీవ్రంగా ఉంది. వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున, కార్తికేయ బెదురులంక 2012, దుల్కర్ సల్మాన్ కింగ్ అఫ్ కోతలు బరిలో ఉన్నాయి. ఇవి కాకుండా బాలీవుడ్ మూవీ డ్రీం గర్ల్ 2ని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. వీటి కాంపిటీషన్ ని తట్టుకుని హాస్టల్ బాయ్స్ నెగ్గాల్సి ఉంటుంది. గతంలో కన్నడ ఇండస్ట్రీ హిట్ కిరిక్ పార్టీని కిరాక్ పార్టీతో రీమేక్ చేసి చేదు అనుభవం అందుకున్నాక ఇప్పుడీ హాస్టల్ హుడుగురుని అనువాదం చేయడమే ఉత్తమమైన పని.
This post was last modified on August 11, 2023 11:02 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…