Movie News

అనిరుధ్ వైపు చూడండి టాలీవుడ్ స్టార్స్

టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానులు.. మిగతా సినీ ప్రియులు.. సోషల్ మీడియాలో తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌కు ఇచ్చే ఎలివేషనే వేరుగా ఉంటుంది. కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు అతనిచ్చే మ్యూజిక్ మన వాళ్లకు విపరీతంగా నచ్చేస్తుంటుంది. తన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి అక్కడి ప్రేక్షకుల కంటే మన వాళ్లు ఎక్కువ ఎలివేషన్లు ఇస్తుంటారు. పెద్ద పెద్ద డిస్కషన్లు పెడుతుంటారు.

అంతే కాదు.. మన టాప్ స్టార్లలో ఎవరివైనా సినిమాలు మొదలవబోతుంటే.. అనిరుధ్‌ను సంగీత దర్శకుడిగా పెట్టుకోమని డిమాండ్లు చేస్తుంటారు. ఈ విషయమై హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రెండ్ చేసిన ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న ‘దేవర’ సినిమాకు ఇలా డిమాండ్ చేసే అనిరుధ్‌ను సంగీత దర్శకుడిగా పెట్టడానికి పరోక్షంగా కారణమయ్యారు. పవన్ కళ్యాణ్ సినిమా ‘ఓజీ’కి కూడా ఇలాంటి డిమాండ్లే వినిపించాయి కానీ.. తమన్‌ను ఓకే చేశారు.

ఐతే అభిమానులు ఎందుకు ఇంతలా అనిరుధ్‌ను కోరుకుంటారనడానికి తాజా రుజువు.. జైలర్. రజినీకి అనిరుధ్ మేనల్లుడి వరస అనే విషయం చాలామందికి తెలియదు. కానీ అంతకంటే ముందు అతను సూపర్ స్టార్‌కు పెద్ద ఫ్యాన్ బాయ్. రజినీ సినిమాలకు అతను ఇచ్చే పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్లో ఉంటాయి. ఇంతకుముందు ‘పేట’ సినిమాకు అతనిచ్చిన మ్యూజిక్ సెన్సేషన్ అయింది.

ఇప్పుడు ‘జైలర్’ విషయంలోనూ అతను అదరగొట్టేశాడు. నిజానికి కంటెంట్ పరంగా ‘జైలర్’ వీక్ మూవీ. కానీ అనిరుధ్.. తన మార్కు స్టైలిష్ బీజీఎంతో చాలా సన్నివేశాలను ఎలివేట్ చేశాడు. రజినీ అభిమానులకు అనేక చోట్ల గూస్ బంప్స్ ఇచ్చాడు. ఫ్యాన్స్‌ను అతను ఎక్కడా కుదురుగా కూర్చోనివ్వలేదు. హుకుం, కావాలయ్యా పాటలు కూడా సినిమాకు ఎసెట్ అయ్యాయి.

ఈ సినిమా చూస్తున్న వేర్వేరు హీరోల తెలుగు ఫ్యాన్స్‌ కచ్చితంగా.. తమ హీరోలకు కూడా అనిరుధ్ ఇలాంటి మ్యూజిక్ ఇస్తే.. అభిమానులను ఉర్రూతలూగిస్తే బాగుంటుందని అనుకుంటే అతిశయోక్తి కాదు. ‘అజ్ఞాతవాసి’ ఎందుకో మిస్ ఫైర్ అయింది కానీ.. మంచి మాస్ మూమెంట్స్ ఉన్న సినిమాకు అనిరుధ్‌ను సంగీత దర్శకుడిగా పెట్టుకుంటే మ్యూజిక్‌తో మోత మోగించేస్తాడనడంలో సందేహం లేదు. తమ అభిమానులను సంతృప్తిపరచాలంటే మాత్రం టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ అనిరుధ్‌తో ఒక్క సినిమా అయినా చేయాల్సిందే.

This post was last modified on August 11, 2023 9:22 am

Share

Recent Posts

మ‌హావ‌తార న‌ర‌సింహ.. తెలుగు రైట‌ర్ ఆవేద‌న‌

మ‌హావ‌తార న‌ర‌సింహ‌.. గ‌త ఏడాది పాన్ ఇండియా స్థాయిలో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సినిమా. ఈ యానిమేష‌న్ మూవీ రిలీజ‌య్యే…

1 hour ago

ఛలో దర్శకుడిని తిట్టారా పొగిడారా

టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల్లో వెంకీ కుడుముల పేరు ఖచ్చితంగా ఉంటుంది. రష్మిక మందన్న ఇవాళ ఈ స్థాయికి వచ్చిందంటే ఛలో…

2 hours ago

లిఫ్ట్ అడిగేటప్పుడు జాగ్రత్త మహిళలు

మహిళల భద్రతపై మరోసారి ఆందోళన కలిగించే ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ఇంటికి వెళ్లేందుకు ఆటోలో లిఫ్ట్ ఇస్తామని నమ్మించిన ఇద్దరు…

2 hours ago

అక్రమ సంబంధాల వివాదం… మళ్ళీ సీఈవోగా వస్తానంటున్న జెన్సెన్

ప్రపంచ టెక్ రంగంలో సంచలనం సృష్టించిన ఎన్విడియా మాజీ సీఈవో జెన్సెన్ హువాంగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. వివాహేతర…

2 hours ago

పాపం… ట్రైన్ ఎక్కిద్దాం అని వెళ్ళి ఫైన్ కట్టి వచ్చారు

బంధువులను రైలు ఎక్కించడానికి వెళ్లినవాళ్లు అనుకోకుండా అదే రైలులో ప్రయాణించాల్సి వచ్చింది. పైగా టికెట్లు లేకపోవడంతో ఏకంగా రూ.36,140 చెల్లించాల్సి…

2 hours ago

చిరు లీక్స్ రొటీన్ అవుతున్నాయా

మెగాస్టార్ చిరంజీవి స్క్రీన్ మీదే కాదు స్టేజి పైన ఉన్నప్పుడు కూడా ఆయన ఎనర్జీ వేరే లెవెల్ లో ఉంటుంది.…

2 hours ago