మాములుగా కొత్త సినిమాల విడుదల కోసం నిర్మాతలు ఒకే డేట్ మీద పోటీ పడటం సహజం. అది తప్పేమీ కాదు. ఎవరి కారణాలు వారికి ఉంటాయి. రిస్క్ కి పూర్తి బాధ్యత తీసుకుని అన్ని లెక్కలు వేసుకుని క్లాష్ కి సిద్ధ పడతారు. కానీ ఎప్పుడో ఆడేసి వెళ్లిపోయిన రీ రిలీజులకు ఇలా చేయడం కరెక్ట్ కాదు. వచ్చే నెల సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆ సందర్భంగా గుడుంబా శంకర్ 4కెని మళ్ళీ విడుదల చేస్తామని నిర్మాత నాగబాబు ఎప్పుడో చెప్పారు. దానికి వచ్చే వసూళ్లను జనసేన పార్టీకి విరాళంగా ఇస్తామని ప్రకటించారు. ఆరంజ్ కు ఈ పద్దతే ఫాలో కావడం తెలిసిందే.
తీరా చూస్తే బండ్ల గణేష్ ఇదే రోజు తన గబ్బర్ సింగ్ వదులుతానని అనౌన్స్ చేయడం ఫ్యాన్స్ లో అయోమయానికి దారి తీసింది. దీంతో నాగబాబు ఆగస్ట్ 31 నుంచే షోలు ఉంటాయని ప్రకటించడం మరో ట్విస్ట్. ఇలా పరస్పరం పోటీకి దిగడం వల్ల వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ. ఆ మధ్య ఇదే తరహాలో చాలా తక్కువ గ్యాప్ తో తమ్ముడు, జల్సాని వదిలారు. సోలోగా వచ్చి ఉంటే పెద్ద రికార్డులు దక్కేవని బయ్యర్లు ఇప్పటికీ అంటుంటారు. కానీ ఇప్పుడు గుడుంబా శంకర్, గబ్బర్ సింగ్ ని ఒకే టైంలో దించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో లేట్ గా ప్రకటించిన గణేష్ తెలుసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.
మహేష్ బాబు ఫ్యాన్స్ సెట్ చేసిన బిజినెస్ మెన్ రికార్డులని పవన్ ఫాలోయర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండు సినిమాలు ఒకేసారి వస్తే అది జరగదు. మరి బండ్ల గణేష్ రాజీ పడి నెక్స్ట్ టైం అంటాడేమో చూడాలి. సెప్టెంబర్ 1న విజయ్ దేవరకొండ ఖుషి ఉంది. మైత్రి సంస్థ భారీ ఎత్తున ప్లాన్ చేసుకుంటోంది. రౌడీ హీరో కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ జరిగేలా చూస్తోంది. అలాంటప్పుడు రెండు పవన్ పునః విడుదలలు ఉంటే అందరికీ ఇబ్బందే. మధ్యే మార్గంగా ఒకరు డ్రాప్ అంటే అది గబ్బర్ సింగే అవ్వాలని ఫ్యాన్స్ కోరిక. మరి బండ్లన్న వింటాడో లేదో లెట్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on August 9, 2023 5:54 pm
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన విధినిర్వహణలో దూసుకుపోతున్నారు. పాలనలో కీలకమైన గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ…
కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి…
తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు…
ఏపీలోని పేద ప్రజల గుండెకు భరోసా అందించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమలులోకి…
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…