ఇండియన్ సినిమాలో డాన్ అనేది ఐకానిక్ క్యారెక్టర్. అమితాబ్ బచ్చన్ మొదటిసారి ఈ పాత్రను పోషించినప్పుడు ఆడియన్స్ వెర్రెత్తిపోయారు. గ్యాంగ్ స్టర్ డ్రామాలో ఒక సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి ఎందరికో స్ఫూర్తినిచ్చారు. తర్వాత ఇదే పాత్రను స్వర్గీయ ఎన్టీఆర్, సూపర్ స్టార్ రజనీకాంత్, అజిత్, ప్రభాస్ లు పోషించి తమ ఫిల్మోగ్రఫీలో క గొప్ప ల్యాండ్ మార్క్ ని పొందుపరుచుకున్నారు. షారుఖ్ ఖాన్ కేవలం రీమేక్ చేయడంతోనే ఆగకుండా కొత్త కథతో డాన్ 2 కూడా చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక్కడి దాకా కథ మొత్తం సవ్యంగానే సాగింది.
ఇప్పుడు డాన్ 3కి రంగం సిద్ధం చేస్తున్నారు. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో 2025లో విడుదల చేసేలా భారీ బడ్జెట్ తో రూపొందించనున్నారు. టైటిల్ రోల్ రణ్వీర్ సింగ్ చేయబోతున్నాడనే వార్త కొద్దిరోజుల క్రితమే లీకయ్యింది. ఇవాళ వదిలిన అనౌన్స్ మెంట్ లో తన పేరుని రివీల్ చేయలేదు. అయితే ఇతను అంత సీరియస్ క్యారెక్టర్ కి న్యాయం చేయగలడానే అనుమానం అందరిలోనూ ఉంది. ఎందుకంటే రణ్వీర్ ఎంత టాలెంటెడ్ హీరో అయినా సరే హైపర్ యాక్టివ్ పాత్రలకు బాగా సూటవుతాడు. సెటిల్డ్ గా కనిపించడం అతని బాడీ లాంగ్వేజ్ కి అంతగా నప్పదు. కొంచెం ఓవర్ చేయడం కూడా అలవాటే.
ఉదాహరణకు టెంపర్ హిందీ రీమేక్ సింబాలో ఇతనిది జూనియర్ ఎన్టీఆర్ తో పెర్ఫార్మన్స్ పోల్చుకుంటే చాలు మ్యాటర్ అర్థమైపోతుంది. కానీ ఫర్హాన్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. నిజానికి డాన్ 3ని షారుఖ్ తో చేయించడానికి విశ్వప్రయత్నాలు జరిగాయి. కానీ బాద్షా ఒప్పుకోలేదు. డాన్ ప్రేక్షకుల మనసులో ఒక గొప్ప అభిప్రాయంతో నిలుచుండి పోయిందని, కేవలం బ్రాండ్ తో బిజినెస్ చేయలేననే ఉద్దేశంతో సున్నితంగా తిరస్కరించారట. ఒకవేళ డాన్ 3 బ్లాక్ బస్టర్ అయినా ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి మళ్ళీ ప్రభాస్ తో రీమేక్ చేసే ఛాన్స్ ఉండదు.
This post was last modified on August 8, 2023 9:13 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…