Movie News

గుంటూరు కారంకు బిజినెస్ మెన్ సహాయం

ఇంకో మూడు రోజుల్లో ఆగస్ట్ 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వచ్చేస్తోంది. గుంటూరు కారం నుంచి ఫస్ట్ సింగల్ రావొచ్చని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు కానీ ఆ కానుక వచ్చే సూచనలు క్రమంగా తగ్గిపోతున్నాయి. తమన్ కంపోజింగ్ అయితే చేశాడు కానీ విదేశాల్లో ఉన్న మహేష్ బాబు ఓకే చేస్తే తప్ప బయటికి వదల్లేరు. ఈ సినిమా మ్యూజిక్ విషయంలో చాలా పట్టుదలగా ఉన్న మహేష్ ఎట్టి పరిస్థితుల్లో రాజీ ప్రసక్తే లేదంటున్నారు. సర్కారు వారి పాట టైంలో తొందరపడటం వల్లే అల వైకుంఠపురం రేంజ్ ఆల్బమ్ రాలేదనే అభిమానుల ఫీలింగ్ హీరోకూ ఉన్నట్టు కనిపిస్తోంది.

ఒకవేళ పాట సిద్ధంగా ఉంటే ఈపాటికి కౌంట్ డౌన్ మొదలుపెట్టి సోషల్ మీడియాలో ప్రమోషన్లు చేసేవాళ్ళు. కానీ తమన్, నిర్మాత నాగ వంశీ ట్విట్టర్ అకౌంట్లలో ఎలాంటి అప్డేట్ లేదు. హఠాత్తుగా ఒక రోజు ముందు హడావిడి చేస్తారని అనుకోలేం. మహా అయితే ఒక పోస్టర్ తప్ప అంతకు మించిన కంటెంట్ రాకపోవచ్చని ఇన్ సైడ్ టాక్. అయితే అభిమానులు బిజినెస్ మెన్ రీ రిలీజ్ హడావిడిలో పడటంతో గుంటూరు కారం గురించి మేకర్స్ ని ఒత్తిడి చేయడం లేదు. లేకపోతే త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తూ లేదా తమన్ ని నిందిస్తూ ఈపాటికి బోలెడు ట్వీట్లు ట్రోల్స్ జరిగిపోయేవి.

ఒకరకంగా బిజినెస్ మెన్ వల్ల గుంటూరు కారంకు చాలా హెల్ప్ అయ్యింది. ప్రతిసారి తన కొత్త సినిమాల సంగతులను ఏదో ఒక రూపంలో గిఫ్ట్ గా ఇచ్చే మహేష్ బాబు హైదరాబాద్ లో లేకపోవడం కూడా ఈ ఆలస్యానికి కారణంగా తోస్తోంది. విడుదలకు ఎక్కుడ సమయం లేదు. ఇంకో అయిదు నెలల్లో రిలీజ్ డేట్ వచ్చేస్తుంది. ఇంకా బ్యాలన్స్ టాకీ,  పాటల చిత్రీకరణ పెండింగ్ ఉన్నాయి. ప్రమోషన్ల కోసం ఎంత లేదన్నా ఒక రెండు మూడు వారాలు రిజర్వ్ లో ఉంచుకోవాలి. ఇంత ఒత్తిడి మధ్య త్రివిక్రమ్ టీమ్ లక్ష్యాన్ని చేరుకుంటుందో లేదో చూడాలి మరి. 

This post was last modified on August 6, 2023 3:08 pm

Share

Recent Posts

లోక‌ల్ వార్‌.. వైసీపీ వాటిని వ‌దులుకోవాల్సిందే భ‌య్యా.. !

స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…

2 hours ago

బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…

4 hours ago

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…

4 hours ago

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

5 hours ago

ముగ్గుర్ని చంపేస్తే నాన్న చూసుకుంటాడా?

ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…

5 hours ago

రామాయణం కన్నా ఆదిపురుష్ నయం ఏమో?

‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…

6 hours ago