ఇండియన్ సినిమాలు ఇంగ్లిష్ భాషలోకి అనువాదమై అంతర్జాతీయ స్థాయిలో రిలీజవడం కొత్తేమీ కాదు. కానీ ముందు భారతీయ భాషల్లో రిలీజయ్యాక కొంత గ్యాప్ తీసుకుని ఇంగ్లిష్ వెర్షన్లు రెడీ చేస్తుంటారు ఫిలిం మేకర్స్. ఐతే ప్రభాస్ కొత్త సినిమా ‘సలార్’ను మాత్రం అలా కాకుండా లోకల్ భాషలతో పాటు ఒకేసారి ఇంగ్లిష్‌లో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.
‘సలార్’ను దాదాపు పది భాషల్లో రిలీజ్ చేస్తారని ఇంతకుముందే ప్రచారం జరిగింది. కానీ ఆరంభంలో ఇలా ఘనంగా ప్రకటనలు చేస్తారు కానీ.. రిలీజ్ టైంకి మూణ్నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తే ఎక్కువ అన్నట్లు ఉంటుంది. ఆ భాషల్లో సమయానికి సినిమాను రిలీజ్ చేయడమే సవాలుగా మారుతుంది.
కానీ ‘సలార్’ షూటింగ్ చాలా ముందుగానే పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కూడా దాదాపుగా ముగింపు దశకు తీసుకొచ్చేసింది టీం. విడుదలకు ఇంకో రెండు నెలల సమయం ఉండగా.. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు మాత్రమే మిగిలున్నాయట. ఒక్కో భాషకు ఒక్కో టీంను పెట్టి డబ్బింగ్ పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘సలార్’ను ఒకేసారి అంతర్జాతీయ స్థాయిలో ఇంగ్లిష్ భాషలో విడుదల చేయడానికి ప్రశాంత్ నీల్ అండ్ టీం కష్టపడుతోందట.
సెప్టెంబరు 28కు ఎలాగైనా ఇంగ్లిష్ వెర్షన్‌ను తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతోంది. ఇండియా వరకు తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో సినిమా రిలీజ్ కాబోతోంది. ఇంగ్లిష్‌లో కూడా అదే రోజు రిలీజైతే ఇదొక రికార్డు అవుతుంది. మరి చిత్ర బృందం డెడ్ లైన్‌ను అందుకుంటుందేమో చూడాలి. ఈ నెలలోనే ‘సలార్’ ట్రైలర్ లాంచ్ కాబోతోంది. ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు విలన్ పాత్రలు పోషించారు.
This post was last modified on August 3, 2023 6:26 pm
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…
శంకర్.. ఒకప్పుడు ఈ పేరు చూసి కోట్లమంది కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవారు. హీరోలు కథ వినకుండానే సినిమా ఒప్పేసుకునేవారు.…
యాదృచ్చికమో లేక కాకతాళీయమో చెప్పలేం కానీ హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు మధ్య కాంబో రెండుసార్లు ఒడిదుడుకులకు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి కంకర్యాలు, స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల బాగోగులను పర్యవేక్షఇంచేందుకు ఏర్పాటైనదే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఏపీ ప్రభుత్వమే ఈ…
ఇప్పుడంతా టాలీవుడ్ లో సంక్రాంతి హడావిడి నడుస్తోంది. హిట్ టాక్ తో రెండు దూసుకుపోతున్నా బాక్సాఫీస్ డామినేషన్ మాత్రం పూర్తిగా…
తెలుగు మీడియా రంగంలో ఇప్పుడు ఏ పత్రికను చూసినా… ఏ ఛానెల్ ను చూసినా…వాటి వెనుక ఉన్న రాజకీయ పార్టీలు…