ఈ మధ్య టాలీవుడ్లో యంగ్ హీరోల యాటిట్యూడ్ గురించి పెద్ద చర్చే నడుస్తోంది. సక్సెస్ అందుకున్నాక హీరోలు కొండెక్కి కూర్చుంటున్నారని.. దర్శకులకు సరైన గౌరవం కూడా ఇవ్వట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యంగ్ హీరో విశ్వక్సేన్ ఇలా రెండుసార్లు వివాదాల్లో చిక్కుకున్నాడు. సీనియర్ నటుడు అర్జున్ తన స్వీయ దర్శకత్వంలో మొదలుపెట్టిన సినిమా నుంచి విశ్వక్ వైదొలగడంపై ఎంత తీవ్ర ఆరోపణలు చేశారో తెలిసిందే.
ఈ మధ్య ‘బేబి’ సినిమా టీం నుంచి కూడా విశ్వక్ ఇంకో రకమైన ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆ సినిమా కథ చెప్పడానికి ట్రై చేస్తే విశ్వక్ వినడానికి కూడా ఆసక్తి చూపించలేదనే చర్చ నడవగా.. ఒక సినిమా ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం తన ఛాయిస్ అంటూ తనను టార్గెట్ చేస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదని అతను ఇన్‌డైరెక్ట్‌గా ‘బేబి’ టీం మీద కౌంటర్లు వేశాడు.
కట్ చేస్తే ఇప్పుడు ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ ఒక యంగ్ హీరోను టార్గెట్ చేస్తూ ఓ ట్వీట్ వేసి కాసేపటికే దాన్ని డెలీట్ చేశాడు. తన యాటిట్యూడ్‌తో ఈ మధ్యే ఒక మంచి హిట్ కొట్టిన హీరోకు సక్సెస్ తలకు ఎక్కిందని.. ఒక డెబ్యూ డైరెక్టర్ కథ చెప్పబోతే అతడితో అవమానకరంగా వ్యవహరించాడని ఆయన ఆరోపించాడు. సక్సెస్‌ను హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి.. ఇది పద్ధతి కాదు అన్నట్లుగా ఆయన ట్వీట్‌లో పేర్కొన్నాడు.
ఐతే ఎవరా హీరో అంటూ ట్విట్టర్ జనాలు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఏవేవో రెఫరెన్సులు ఇస్తుండగా.. ఆయన అంతలోనే ట్వీట్ డెలీట్ చేసేశారు. ఆ ట్వీట్ చూసిన వాళ్లు మాత్రం అంత యాటిట్యూడ్ చూపించిన ఆ హీరో ఎవరు అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. శోభు మామూలుగా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ ఇలా ట్వీట్ వేశారంటే సదరు యంగ్ హీరో తీరు ఆయన్ని బాగానే కోపం తెప్పించినట్లుంది.
This post was last modified on July 31, 2023 6:32 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…