స్వీయ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తీసుకున్న దాస్ కా ధమ్కీ అంచనాలకు తగ్గట్టు సక్సెస్ కాకపోవడంతో విశ్వక్ సేన్ కొత్త మేకోవర్ చేసుకుని నటిస్తున్న గ్యాంగ్స్ అఫ్ గోదావరి మీద అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. రౌడీ ఫెలో, చల్ మోహన్ రంగా ఫేమ్ కృష్ణ చైతన్య డైరెక్షన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ గ్యాంగ్స్ అఫ్ వసేపూర్ స్టైల్ లో దీనికి పేరు నిర్ణయించడం గమనార్హం. డిసెంబర్ విడుదలకు ప్లాన్ చేసుకుంటున్న ఈ మాఫియా డ్రామాలో నేహా శెట్టి హీరోయిన్ కాగా యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చడం విశేషం.
టీజర్ లో సినిమా కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు. గోదావరి ప్రాంతంలో పరస్పరం వైరుధ్య భావాలున్న ముఠాలు, రాజకీయ నాయకుల మధ్య జీవనోపాధి కోసం పోరాటం చేసే యువకులు. మంచిగా మాట్లాడ్డమే కాదు తేడా వస్తే నవ్వుతు నరం లాగేసే తత్వం వీరిది. స్వార్థ శక్తుల ఆటలో పావులుగా మారిన ఈ చదరంగంలో ఓ కుర్రాడు(విశ్వక్ సేన్) కత్తి పట్టాల్సి వస్తుంది. నాయకుడిగా మారే క్రమంలో ఎన్నో సవాళ్ళను ఎదురుకుంటాడు. అవేంటనేది తెరమీద చూడాలి. విశ్వక్ రఫ్, రస్టిక్ గా నటించాడు. కురచగా మార్చుకున్న హెయిర్ స్టయిల్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది.
విజువల్స్ లో డెప్త్ ఉంది. మెయిన్ క్యాస్టింగ్ ని రివీల్ చేశారు. సాయికుమార్, నాజర్, గోపరాజు రమణ, అంజలితో పాటు నేహా శెట్టిని కూడా చూపించారు. యువన్ శంకర్ రాజా నేపధ్య సంగీతం ఎలివేట్ చేసింది. ఇలాంటి రా డ్రామాలు అరుదుగా వస్తున్న తరుణంలో గ్యాంగ్స్ అఫ్ గోదావరి అంచనాలు పెంచేలా ఉంది. తుపాకుల మోత, ఆధిపత్య గొడవల మధ్య గోదావరి అందాలను దర్శకుడు కృష్ణ చైతన్య ఎలా చూపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ లో విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఇంకా రిలీజ్ డేట్ ని లాక్ చేయలేదు కానీ ఆ నెలలో రావడం పక్కానే.
This post was last modified on July 31, 2023 12:31 pm
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజకీయాలు కూటమిలోనే అంతర్గత వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజకవర్గం పూర్తిగా పట్టణ పరిధిలో ఉంది.…
ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…