Movie News

రాకీ రాణి ప్రేమ్ కహాని ఎలా ఉంది

ఎప్పుడో జనవరిలో పఠాన్ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి విజయం రాలేదని ఎదురు చూస్తున్న బాలీవుడ్ ఆశలన్నీ రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని మీదే ఉన్నాయి. నిన్న దేశవ్యాప్తంగా భారీ ఎత్తున గ్రాండ్ రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బ్రో తాకిడి ఉన్నప్పటికీ దీనికి మల్టీప్లెక్స్ స్క్రీన్లు ఎక్కువ వచ్చేలా ధర్మా ప్రొడక్షన్స్ వేసిన ప్లానింగ్ స్క్రీన్ల కేటాయింపులో స్పష్టంగా కనిపించింది. నిన్న ఒక్క రోజు పది కోట్లకు పైగా నెట్ వసూలైందని ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు. వీకెండ్ బాగా పికప్ అవుతుందని అంటున్నారు. ఇంతకీ ఈ రాకీ రాణిల ప్రేమకథలో అంత విషయం ఉందా

రాకీ(రణ్వీర్ సింగ్)ది పెద్ద మిఠాయి బిజినెస్ ఉన్న పంజాబీ కుటుంబం. తాతయ్య పేరు కన్వెల్(ధర్మేంద్ర). ఆయనకు తన చిరకాల స్నేహితురాలు జమిని ఛటర్జీ(షబానా అజ్మీ)ని కలవాలనే కోరిక ఉంటుంది. ఇది తెలుసుకున్న రాకీ అది నెరవేర్చాలని బయలుదేరతాడు. ఆమె మనవరాలు జర్నలిస్ట్ రాణి(అలియా భట్)ని చూసి తొలిచూపులోనే మనసు పారేసుకుంటాడు. అయితే పెళ్లికి అభ్యంతరాలు వ్యక్తమవుతాయి. దీంతో ఈ జంట అవతలి వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని రోజులు ఉండాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత వచ్చే చిక్కుముళ్లు, ఎమోషన్ల సమ్మేళనమే అసలు కథ.

దర్శకుడు కరణ్ జోహార్ చాలా గ్రాండియర్ గా తెరకెక్కించారు. అయితే సుదీర్ఘమైన నిడివితో పాటు ఇంటర్వెల్ కు ముందు వరకు కథా కథనాలు మరీ రొటీన్ గా వెళ్లడంతో మరీ స్పెషల్ గా ఏమీ అనిపించదు. సెకండ్ హాఫ్ లో ఎంటర్ టైన్మెంట్, మ్యూజిక్, భావోద్వేగాలు బాగానే కుదిరాయి. అయితే కభీ ఖుషి కభీ ఘం లాంటి నెరేషన్ స్టైల్ ఇష్టమైతే తప్ప సగటు ప్రేక్షకులకు ఈ రాకీ రాణి ప్రేమ్ కహాని అంత సులభంగా కనెక్ట్ అవ్వదు. కాకపోతే ఈ మధ్య వచ్చిన ఎన్నో బాలీవుడ్ డిజాస్టర్స్ తో పోలిస్తే చాలా బెటర్ అనిపిస్తుంది. తీవ్రంగా నిరాశపరిచే ప్రమాదాన్ని తప్పించుకుంది అంతే.

This post was last modified on July 29, 2023 1:47 pm

Share

Recent Posts

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

2 minutes ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

2 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

2 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

2 hours ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

3 hours ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

4 hours ago