తెలుగు రియాలిటీ షోలలో ఒక కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నించిన వాటిలో బిగ్ బాస్ ఒకటి. వివాదాలే కేంద్రంగా నడిచే ఈ ఆటకు మొదట జూనియర్ ఎన్టీఆర్, నానిలు హోస్ట్ గా పని చేశారు. ఆ ఇద్దరూ తర్వాత కొనసాగేందుకు ఇష్టపడలేదు. అక్కడి నుంచి ఇది నాగార్జున చేతికి వచ్చాక సక్సెస్ ఫుల్ గా మరో నాలుగు సీజన్లు నడిపించారు. రేటింగ్స్ పరంగా వంద రోజుల ఈ గేమ్ షో అద్భుతాలు చేయకపోయినా ఫినాలే వచ్చేనాటికి హాట్ టాపిక్ గా నిలుస్తున్న మాట వాస్తవం. ఇప్పుడీ సిరీస్ ఏడో భాగానికి రంగం సిద్ధమవుతోంది. పార్టిసిపెంట్స్ లిస్టు లీకుల రూపంలో వస్తోంది.
దాని ప్రకారం ఈసారి టివి స్టార్ యాక్టర్ ప్రభాకర్, యాంకర్ నిఖిల్ , నృత్య దర్శకుడు ఢీ పండు, గాయని మోహన భోగరాజు, టిక్ టాక్ ద్వారా పాపులరైన దుర్గారావు జంట, నటి విష్ణుప్రియ భీమినేని, హీరో సాయిరోనక్, నటి శోభా శెట్టి, జబర్దస్త్ వర్షలతో ఒప్పందాలు జరిగిపోయాయని తెలిసింది. మొత్తం 21 సభ్యుల్లో బయటికి వచ్చిన పేర్లు పది మాత్రమే. మిగిలినవి కూడా మరికొద్ది రోజుల్లో రివీల్ కావొచ్చు. అగ్రిమెంట్లు కొంత ఆలస్యమవుతున్నందున స్టార్ మా ఛానల్ సైతం ఎప్పటి నుంచి మొదలుపెట్టేది చెప్పడం లేదు. సెప్టెంబర్ మొదటి వారాన్ని ప్రస్తుతానికి టార్గెట్ గా పెట్టుకున్నారు.
టీవీ షోలకు సెన్సార్ ఉండాల్సిందేననే కోర్టు వ్యాఖ్యానించి బిగ్ బాస్ టీమ్ కి నోటీసులు పంపిన నేపథ్యంలో రాబోయే పరిణామాలను బట్టి షో స్వరూపం మార్పులకు గురయ్యే అవకాశం లేకపోలేదు. నాగార్జున ఇటీవలే సీజన్ 7 ముందస్తు ప్రిపరేషన్ కోసం పాత విజేతలతో ఒక స్పెషల్ ఎపిసోడ్ చేశారు. అసలు గేమ్ మొదలయ్యాక వీకెండ్ షెడ్యూల్స్ ని దానికి అనుగుణంగా మార్చుకుంటారు. గత రెండు సీజన్లు ఆశించిన స్థాయిలో స్పందన దక్కించుకోకపోవడంతో ఈసారి మరింత మసాలా, కాంట్రావర్సీలు ప్లాన్ చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఎంత మేరకు అవి సాధ్యమవుతాయో వేచి చూడాలి.
This post was last modified on July 27, 2023 6:57 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…