తమిళంలో చాలా తక్కువ సినిమాలతోనే ‘లెజెండరీ’ స్టేటస్ అందుకున్న దర్శకుడు సెల్వ రాఘవన్. కాదల్ కొండేన్, 7/జి బృందావన కాలనీ, పుదుపేట్టై, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, మయక్కం ఎన్న లాంటి క్లాసిక్స్‌తో అతడికి చాలా గొప్ప పేరే వచ్చింది. ఐతే తన మీద ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను తర్వాతి కాలంలో అతను అందుకోలేకపోయాడు.
గత ఆరేడేళ్లలో సెల్వ నుంచి వచ్చిన సినిమాలేవీ ఆకట్టుకోలేదు. చివరగా అతను తీసిన ‘ఎన్జీకే’ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆ సినిమా తర్వాత సెల్వ ఖాళీగా ఉన్నాడు. ఎస్జే సూర్యతో అతను తీసిన ఓ సినిమా విడుదలకు నోచుకోకుండా ఆగిపోగా.. అతను అనుకున్న వేరే సినిమాలు కార్యరూపం దాల్చలేదు. దీంతో ఏడాదిగా ఖాళీగా ఉన్నాడు సెల్వ.
ఇప్పుడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్ తమిళ ప్రేక్షకులకు పెద్ద షాకే ఇచ్చాడు. అతను నటుడిగా కొత్త అవతారం ఎత్తుతున్నాడు. లుక్స్ పరంగా చూస్తే సెల్వ డిఫరెంటుగా ఉంటాడు. అతను బాగా రిజర్వ్డ్ కూడా. ఎప్పుడూ ముభావంగా కనిపిస్తాడు. అలాంటి వాడు నటుడు కావడమేంటి అని ప్రేక్షకులు అయోమయంలో పడిపోయారు. అతను సినిమా చేయబోయేది ప్రస్తుతం సౌత్ ఇండియా టాప్ హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేష్‌తో కావడం విశేషం.
వీళ్లిద్దరి కాంబినేషన్లో అరుణ్ మహేశ్వరన్ అనే యువ దర్శకుడు ‘సాని కాయిదమ్’ అనే సినిమా చేయబోతున్నాడు. దీని ప్రి లుక్ కూడా రిలీజ్ చేశారు. ఒక అమ్మాయి భుజంపై వేట కొడవలి, చేతిలో తుపాకీ కనిపిస్తుండగా.. పక్కన ఉన్న అబ్బాయి చేతిలో రక్తంతో తడిసిన కత్తి ఉంది. దూరంగా రక్తం కారుతున్న వ్యాన్ ఉంది. దీన్ని బట్టి ఇది వయొలెంట్ మూవీ అని అర్థమవుతోంది. మరి కీర్తితో కలిసి సెల్వ రాఘవన్ నటించిన సినిమా ఎలా ఉంటుందో ఏమో చూడాలి.
This post was last modified on August 16, 2020 4:46 pm
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…