మొదటిసారి విన్నప్పుడు సాధారణంగా అనిపించి తర్వాత విపరీతంగా కనెక్ట్ అయిపోవడం సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ప్రత్యేకత. రజనీకాంత్ జైలర్ నుంచి మొదటి ఆడియో సింగల్ గా కొద్దిరోజుల క్రితం కావాలయ్యా లిరికల్ వీడియో వచ్చిన సంగతి తెలిసిందే. తమిళ మీడియాతో సహా రెండు మూడు రోజులు నెగటివ్ రెస్పాన్స్ కనిపించింది. తమన్నా హుషారైన స్టెప్పులు మొదట్లో ఎక్కలేదు. కట్ చేస్తే ఇప్పుడీ కావాలయ్యా యాయాయా అంటూ లెక్కలేనన్ని రీళ్లు, ఇమిటేషన్ వీడియోలు, కవర్ సాంగులు చేయడం మొదలుపెట్టారు. క్రమంగా ఛార్ట్ బస్టరయ్యేలా ఉంది.
రజనీకాంత్ ఊరికే చేతులు ఆడించడం తప్ప డాన్స్ చేయకపోయినా ఆ భారమంతా తమన్నా చూసుకుంది. సినిమా హైలైట్స్ లో ఇది ఒకటిగా నిలవడం ఖాయమని అభిమానులు కన్ఫర్మ్ చేసుకున్నారు. లియో నుంచి ఇదే అనిరుద్ కంపోజ్ చేసిన సాంగ్ ని ఈ కావాలయ్యా మైళ్ళదూరంలో నెట్టేయడం ఖాయమని ఫ్యాన్స్ సంబర పడుతున్నారు. నిజానికి జైలర్ కన్నా లియో మీదే ఎక్కువ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇలా స్పందన రివర్స్ కావడం ఊహించనిది. తాజాగా వచ్చిన రెండో పాట కూడా హిట్టయ్యేలానే ఉంది.
ఇది జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని హమ్మయ్య అనుకునేలా చేస్తోంది. ఎందుకంటే దేవరతో పాటు విడి 12కి తనే సంగీత దర్శకుడు. ఇలాంటి ట్యూన్స్ తమ హీరోలకూ పడితే బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అవుతుందని ఎదురు చూస్తున్నారు. కోలీవుడ్ లోనే కాదు సౌత్ లోనే హయ్యెస్ట్ డిమాండ్ ఉన్న అనిరుద్ ని పట్టుకోవడం అంత సులభంగా లేదు. విపరీతమైన పని ఒత్తిడి మధ్య సమయానికి పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయించుకోవాలంటే అదో పెద్ద యుద్ధమే. ఒకప్పుడు ఏఆర్ రెహమాన్ చూసిన స్టార్ డంని ఇప్పుడీ కుర్రాడు ఎంజాయ్ చేస్తున్న మాట వాస్తవం.
This post was last modified on July 18, 2023 8:07 am
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…