సోలో హీరోగా విడుదలయ్యింది ఒక్క సినిమానే అయినప్పటికీ శ్రీకాంత్ కొడుకు రోషన్ డిమాండ్ మాములుగా లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరంగేట్రం చేసిన నిర్మల కాన్వెంట్, కథానాయకుడిగా మేకప్ వేసుకున్న పెళ్లి సందD రెండూ విజయం సాధించలేదు. అయితేనేం మైత్రి లాంటి పెద్ద బ్యానర్లు తనతో ప్రాజెక్టులను లైన్ లో పెట్టాయి. తాజాగా అదిరిపోయే రేంజ్ లో ఓ పెద్ద ఆఫర్ పట్టేశాడు. మోహన్ లాల్ హీరోగా మలయాళం, తెలుగు బైలింగ్వల్ గా ఒకేసారి తెరకెక్కబోతున్న వృషభలో కీలకమైన కొడుకు క్యారెక్టర్ పట్టేశాడు. ప్యాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో ప్లాన్ చేశారు.
ఇది ఫాదర్ ఎమోషన్ మీద నడిచే కథగా చాలా గొప్పగా ఉంటుందని మల్లువుడ్ టాక్. నటి సిమ్రాన్ తల్లిగా కనిపించనుంది. కెజిఎఫ్ లో గరుడగా భయపెట్టిన రామచంద్రరాజుని ఒక విలన్ గా ఎంచుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చబోతున్నాడు. ఈ నెలాఖరు నుంచి లండన్ లో షూటింగ్ మొదలుపెడతారు. వందల కోట్ల బడ్జెట్ అంటున్నారు కానీ ఎంతనేది బయటికి చెప్పడం లేదు. నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్న వృషభని ఎపిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా పేర్కొంటున్నారు. అయితే పీరియాడిక్ డ్రామానా లేక వర్తమానమా అనేది మాత్రం చెప్పడం లేదు.
జనతా గ్యారేజ్ లో జూనియర్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న మోహన్ లాల్ ఆ తర్వాత మళ్ళీ తెలుగు స్ట్రెయిట్ మూవీ చేయలేదు.ఇప్పుడు రోషన్ కు ఆ ఛాన్స్ దక్కింది. వృషభలో కంప్లీట్ యాక్టర్ తో సమానంగా సాగే క్యారెక్టర్ కాబట్టే శ్రీకాంత్ ఒప్పుకున్నట్టుగా తెలిసింది. కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి అవకాశాలు రావడం అరుదు. అందులోనూ అంత సీనియర్ మోస్ట్ హీరోతో కలిసి పని చేస్తున్నప్పుడు ఎన్నో నేర్చుకోవచ్చు. ఎలాగూ లేలేత టీనేజ్ లోనే నాగార్జునతో పాఠాలు చెప్పించుకున్న రోషన్ ఇప్పుడు సెట్స్ లో మోహన్ లాల్ తో కొత్త అనుభూతి దక్కించుకోబోతున్నాడు
This post was last modified on July 13, 2023 1:50 pm
తాజాగా ప్రకటించిన పద్మ పౌర పురస్కారాల్లో తెలుగు సినీ రంగానికి గొప్ప గౌరవమే దక్కింది. నందమూరి బాలకృష్ణను మూడో అత్యున్నత…
బాలీవుడ్ ప్రముఖ సింగర్ ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లేతో సిరాజ్ తో క్లోజ్ గా ఉన్నారన్న వార్తలు మళ్ళీ…
నిన్న ప్రకటించిన పద్మ పురస్కారాల్లో బాలకృష్ణతో పాటు శోభనకు పద్మభూషణ్ దక్కడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆవిడ…
రాజకీయ ప్రవేశం చేశాక తన చివరి సినిమాగా విజయ్ చేస్తున్న తలపతి 69కి 'జన నాయగన్' టైటిల్ ని ఖరారు…
భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ మరోసారి తన అద్భుతమైన ఆటతీరుతో అందరి ప్రశంసలను అందుకున్నాడు. ఇంగ్లాండ్‌తో రెండో టీ20…
ధమాకా తర్వాత రవితేజ రియల్ మాస్ మళ్ళీ తెరమీద కనిపించలేదు. వాల్తేరు వీరయ్య సంతృప్తి పరిచింది కానీ అది చిరంజీవి…