ఆలియా భట్‍పై పగ పెంచుకున్న సుషాంత్ సింగ్ రాజ్‍పుట్ అభిమానులు ఆమె సినిమా సడక్ 2 ట్రెయిలర్‍పై ఆ కసి అంతా చూపిస్తున్నారు. తొంభై మూడు లక్షలకు పైగా డిస్ లైక్స్తో ఈ ట్రెయిలర్ ప్రపంచ రికార్డు ఏదో సాధించిందట. ఆలియా భట్‍కి తమ సత్తా ఏంటో తెలిసిందని ఆమె యాంటీ ఫాన్స్ ఆనంద పడుతున్నారు కానీ ఇందులో వారికి తెలియకుండానే చాలా లాభం జరిగింది.
మామూలుగా ఈ సినిమా ట్రెయిలర్ వస్తే ఆలియా, సంజయ్ దత్ అభిమానులు మినహా ఎక్కువ మంది పట్టించుకునే వారు కాదేమో. కానీ ఈ డిస్ లైక్స్ వల్ల ఈ ట్రెయిలర్‍కి విపరీతమైన ప్రచారం లభించి, అంతా ఒక లుక్ వేస్తున్నారు. దాంతో ట్రెయిలర్‍కు బ్రహ్మాండమయిన వ్యూస్ వచ్చేసాయి. దాదాపు నాలుగు కోట్ల వ్యూస్ ఈ ట్రెయిలర్ ఇప్పటివరకు సాధించింది. ఇంకా యూట్యూబ్‍లో సెకండ్ ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది. యూట్యూబ్‍లో వ్యూస్‍కి రెవెన్యూ వస్తుంది కానీ డిస్ లైక్స్ వల్ల ఎలాంటి డిడక్షన్ వుండదు.
కాబట్టి ఈ డిస్ లైక్స్ కొట్టే పేరుతో ఈ చిత్రానికి అదనపు ఆదాయాన్ని యాంటీ ఫాన్సే అందిస్తున్నారు. సింపుల్‍గా ఒక ఉదాహరణ చెప్పాలంటే… ఆలియా భట్ హిట్ సినిమా రాజీ ట్రెయిలర్‍కి రెండేళ్లలో 28 మిలియన్ల వ్యూస్ వస్తే, సడక్ 2 ట్రెయిలర్‍కి రెండు రోజుల్లో 39 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
This post was last modified on August 14, 2020 10:01 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…