మాములుగా చిరంజీవితో కలిసి నటించే అవకాశం వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ దానికి భిన్నంగా సిద్దు జొన్నలగడ్డ నో చెప్పడం ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సుష్మిత కొణిదెల నిర్మించబోయే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో శ్రీలీలకు జోడిగా తనను లాక్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ముందు సానుకూలంగానే స్పందించినా మళ్ళీ మనసు మార్చుకుని సున్నితంగా తిరస్కరించినట్టు ఇన్ సైడ్ టాక్. మలయాళం హిట్ మూవీ బ్రో డాడీ రీమేక్ అనే ప్రచారం ఉన్నప్పటికీ యూనిట్ మాత్రం అంతర్గతంగా ఖండిస్తోంది.
సిద్దు తీసుకున్న నిర్ణయం రైటనే చెప్పాలి. ఎందుకంటే చిరంజీవిని హ్యాండిల్ చేస్తున్న దర్శకులు ఎక్కువ ఆయన వైపే ఫోకస్ పెడతారు. క్యారెక్టరైజేషన్ కావొచ్చు స్క్రీన్ స్పేస్ కావొచ్చు ప్రాధాన్యత ముందు మెగాస్టార్ కే ఉంటుంది. అలాంటప్పుడు సిద్దు లాంటి అప్ కమింగ్ హీరోకు ఇది ఇబ్బంది కలిగించే అవకాశం లేకపోలేదు. గాడ్ ఫాదర్ ఆఫర్ వచ్చినప్పుడు తెగ సంబరపడి చేసిన సత్యదేవ్ కు దాని వల్ల వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. పైపెచ్చు విలన్ వేషాలతో నిర్మాతలొచ్చారు. తన ఫేవరెట్ పక్కన నటించి మంచి రెమ్యునరేషన్ తీసుకున్న సంతృప్తి తప్ప ఇంకేం మిగల్లేదు.
ఒకవేళ రవితేజ లాంటి స్టార్ డం పీక్స్ చూసిన హీరో అయితే సిద్దు జొన్నలగడ్డ ఎలాంటి పాత్ర చేసినా చెల్లిపోతుంది. కానీ డీజే టిల్లు తర్వాత వచ్చిన ఇమేజ్ ని కాపాడుకునేందుకు చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నాడు. దాని సీక్వెల్ తప్ప ఇంకేదీ అఫీషియల్ గా ఒప్పుకోలేదు. నందిని రెడ్డితో చేయాల్సిన మూవీని కూడా అన్నీ మంచి శకునములే ఫలితం చూశాక స్క్రిప్ట్ ని మళ్ళీ చెక్ చేసుకునే పనిలో పడ్డాడు. ఇంత ప్లానింగ్ తో ఉన్న సిద్దుకి చిరు మూవీలో ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకే ఏ కోణంలో చూసుకున్నా తన డెసిషన్ రైటే
This post was last modified on July 12, 2023 11:31 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…