ఇంతకుముందులా దక్షిణాది నటీనటులను, టెక్నీషియన్లను బాలీవుడ్ వాళ్లు తక్కువగా చూసే పరిస్థితే లేదు. బాలీవుడ్ మూవీస్‌ను దాటి దక్షిణాది సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తుండటంతో వాళ్లు మన వాళ్ల ముందు తగ్గిపోతున్నారు. దక్షిణాది నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి, ఇక్కడి టెక్నీషియన్లతో పని చేయడానికి వాళ్లెంతో ఉత్సాహం చూపిస్తున్నారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడైన షారుఖ్ ఖాన్.. తమిళ దర్శకుడు అట్లీతో ‘జవాన్’ సినిమా చేశాడు. ఈ సినిమాపై ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు రిలీజైన ట్రైలర్ తరహా ప్రివ్యూ ఆ అంచనాలను ఇంకా పెంచింది. ఇప్పటిదాకా తాను తీసిన సినిమాలన్నింటినీ తలదన్నేలా అట్లీ ఈ చిత్రాన్ని రూపొందించాడని.. బాక్సాఫీస్ దగ్గర ‘జవాన్’ వసూళ్ల మోత మోగించడం ఖాయమని ప్రివ్యూ చూస్తే అర్థమైంది. అంత యాక్షన్ ప్యాక్డ్‌గా ట్రైలర్ కనిపించింది.
ఇక ట్రైలర్ మొత్తం చూస్తే షారుఖ్ ఖాన్ నటించాడు కాబట్టి పేరుకు ఇది బాలీవుడ్ మూవీ కానీ.. ఎటు చూసినా తమిళ టచ్‌యే కనిపిస్తోంది. ఆ ఇండస్ట్రీ నుంచి ఎదిగిన నటీనటులు టెక్నీషియన్లే ఈ సినిమాకు చాలా వరకు పని చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన నయనతార మలయాళీనే అయినా ఆమె హోమ్ ఇండస్ట్రీ కోలీవుడ్డే.
ముఖ్య పాత్ర (బహుశా విలన్ అయి ఉండొచ్చు) పోషించిన విజయ్ సేతుపతి తమిళుడే. మరో ముఖ్య పాత్ర చేసిన ప్రియమణి కూడా కథానాయికగా ఎదిగింది తమిళం నుంచే. ఇంకా ఈ చిత్రానికి సంగీతం అందించిన అనిరుధ్ రవిచందర్.. ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించిన జీకే విష్ణు ఇద్దరూ కూడా తమిళులే. రైటింగ్ డిపార్ట్‌మెంట్లో కూడా అందరూ తమిళులే ఉన్నట్లున్నారు. మిగతా చిన్న చిన్న టెక్నీషియన్లందరూ కూడా తనకు కంఫర్ట్ అనిపించే తమిళులనే పెట్టుకున్నట్లున్నాడు అట్లీ. ఇలా ఒక బాలీవుడ్ మూవీలో తమిళులు ఇంతగా డామినేట్ చేయడం.. అది కూడా షారుఖ్ మూవీలో కావడం విశేషమే.
This post was last modified on %s = human-readable time difference 12:18 am
ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్.…
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…