నందమూరి బాలకృష్ణ కొన్ని రోజులుగా ఎవరికీ అందుబాటులోకి రావడం లేదన్నది ఇండస్ట్రీ వర్గాల మాట. కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఎవరినీ కలవట్లేదని.. కనీసం కథలు వినడానికి కూడా ఇష్టపడట్లేదని.. షూటింగ్ ఎప్పుడు ఉండొచ్చు, ఆ దిశగా ఎలా ప్రిపేర్ అవ్వలి అన్నది కూడా ఆయన పట్టించుకోవడం లేదని.. ఒక రకంగా ఎవరికీ దొరక్కుండా ఆయన అజ్ఞాతంలో ఉంటున్నారని సన్నిహితులు చెబుతున్నారు.
లాక్ డౌన్ షరతులు సడలించి షూటింగ్లకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినప్పటికీ.. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్న వాళ్లు కొంతమందే. బాలయ్య అయితే ఈ విషయంలో ఏమాత్రం సుముఖంగా లేరు.
షూటింగ్లకు అనుమతులివ్వాలని సినీ పెద్దలు.. ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నపుడు దీని వల్ల ఏం ప్రయోజనం లేదని తేల్చేశాడు బాలయ్య. అనుమతులు వచ్చినా షూటింగ్లు జరగవని ఖరాఖండిగా చెప్పేశారు. చివరికి బాలయ్య చెప్పిందే జరిగింది. అనుమతులు వచ్చిన కొత్తలో బాలయ్య కొత్త సినిమా దర్శకుడు బోయపాటి.. నిర్మాతతో కలిసి నిబంధనల ప్రకారం షూటింగ్ చేసేందుకు ప్రణాళికలు రచించాడు. కానీ బాలయ్య మాత్రం ఆ విషయంలో ఎలాంటి ఆసక్తి ప్రదర్శించట్లేదు.
ఇంకో నెల రోజుల్లో పరిస్థితులు మెరుగుపడతాయని, చిత్రీకరణలు పున:ప్రారంభించవచ్చని చాలామంది భావిస్తుండగా.. అక్టోబరు లోపు అయితే షూటింగ్ చేయడానికి బాలయ్య ఏమాత్రం ఆసక్తిగా లేరని సమాచారం. అంత వరకు ఆయన ఎవరినీ కలిసేలా కూడా లేరని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates