ఈ మధ్య కాలంలో పొన్నియిన్ సెల్వన్ 2 తప్ప పెద్దగా బజ్ ఉన్న కోలీవుడ్ సినిమాలేవీ రాలేదు. పోర్ తొజిల్ మౌత్ టాక్ తో హిట్టయ్యింది. అయితే పోస్టర్ల దశ నుంచే విపరీతమైన ఆసక్తి రేపి, క్రేజీ కాంబినేషన్ తో రూపొందిన మామన్నన్ మీద ఇక్కడి మూవీ లవర్స్ లోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఉదయ నిధి స్టాలిన్ కి టాలీవుడ్ మార్కెట్ లేకపోవడంతో డబ్బింగ్ లాంటి సాహసాలు చేయలేదు. కీర్తి సురేష్, ఫహద్ ఫాసిల్ తో పాటు చాలా సీరియస్ రోల్ పోషించిన కమెడియన్ వడివేలు దీనికి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఏఆర్ రెహమాన్ సంగీతం మరో ప్రధాన బలం. మొన్న శుక్రవారం రిలీజయ్యింది
కథేంటో చూద్దాం. కాశీపురం అనే ఊరికి మామన్నన్|(వడివేలు)ఎమ్మెల్యే. వెనుకబడిన వర్గానికి చెందినవాడు. కొడుకు అదివీరన్(ఉదయనిధి స్టాలిన్)అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. పేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ సెంటర్ నడిపే లీల(కీర్తిసురేష్)కు రూలింగ్ పార్టీ నాయకుడైన రత్నవేల్(ఫహద్ ఫాసిల్)అన్నయ్య వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో అదివీరన్, మామన్నన్ లు కలిసి రత్నవేల్ కు ఎదురు తిరిగి అతని పతనం కోసం పని చేయడం మొదలుపెడతారు. ఈ క్రమంలో జరిగే రాజకీయ పరిణామాలు, అనూహ్య సంఘటనలు తెరమీద చూస్తేనే కిక్కు
పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్ లాంటి క్లాసిక్స్ ఇచ్చిన మారి సెల్వరాజ్ ఇందులోనూ పేద వర్సెస్ ధనిక కాన్సెప్ట్ ని తీసుకున్నాడు కానీ దానికి పొలిటికల్ టచ్ ఎక్కువ జోడించడంతో సెకండ్ హాఫ్ కాస్తా రొటీన్ ఫ్లేవర్ లోకి వెళ్లిపోయింది. పాత్రల పరిచయాలు, కాంఫ్లిక్ట్ పాయింట్, అదివీరన్ ధైర్యంగా రత్నవేల్ ని కొట్టే ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగా వచ్చినప్పటికీ ద్వితీయార్థం నెరేషన్ నిరాశ పరుస్తుంది. హై మూమెంట్స్ తగ్గిపోయాయి. ఏ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు అద్భుతంగా కుదిరాయి. వడివేలు, ఫహద్ ఫాసిల్ నటన ప్రధాన హైలైట్స్ గా నిలిచాయి. వీళ్ళ కోసం మాత్రమే మామన్నన్ చూడొచ్చు.
This post was last modified on June 30, 2023 11:59 am
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…