రేపు బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన పోటీకి తెర లేచింది. నిఖిల్ స్పై భారీ ఎత్తున్న ప్యాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతుండగా, పెద్దగా సౌండ్ చేయకుండా స్పెషల్ ప్రీమియర్ల రిపోర్ట్స్ తో సామజవరగమన హైప్ పెంచుకుంటోంది. బడ్జెట్, స్కేల్ లో రెండింటికి సంబంధం లేకపోయినా ఆడియన్స్ ప్రధానంగా కంటెంట్ బాగుంటేనే థియేటర్లకు వస్తున్నారు కాబట్టి దేనికవే కీలకంగా కనిపిస్తున్నాయి. స్పై మీద నిఖిల్ చూపిస్తున్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే కార్తికేయ 2 తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో విజయం వస్తుందేమోననే నమ్మకం అభిమానులు చూపిస్తున్నారు.
ట్రైలర్ తో మొదలుపెట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ దాకా యూనిట్ చెప్పిన మాటల చూస్తే స్పైలో చాలా బలమైన యాక్షన్ మెటీరియల్ ఉందని అర్థమైపోయింది. అంచనాలకు తగ్గట్టు ఉంటే మాత్రం కుర్రహీరోకి మరో బ్లాక్ బస్టర్ పడ్డట్టే. ఇక పూర్తిగా ఎంటర్ టైన్మెంట్ ని నమ్ముకున్న సామజవరగమనకు ప్రీమియర్ల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. రేపు మార్నింగ్ షో అయ్యాకే అసలు క్లారిటీ బయటికి వస్తుంది. షో చూసినవాళ్లు మాత్రం నిరాశ చెందలేదని చెప్పడం ఊరట కలిగించే విషయం. స్పైతో పోలిస్తే బడ్జెట్ పరంగా చాలా తక్కువలో తీసిన సామజవరగమన హిట్టు శ్రీవిష్ణుకి చాలా అవసరం
అయితే అనూహ్యంగా రేపే వస్తున్న ఈ నగరానికి ఏమైంది బుకింగ్స్ చాలా వేగంగా జరుగుతుండగా నిఖిల్, శ్రీవిష్ణు కన్నా ఈ యూత్ మూవీనే ఆన్ లైన్ సేల్స్ లో దూసుకుపోతోంది. ఇదంతా గమనిస్తున్న మరో చిన్న చిత్రం మాయా పేటిక ఒక రోజు ఆలస్యంగా జూన్ 30న వస్తున్నప్పటికీ ఇదీ ఎర్లీ ప్రీమియర్లకు ఓటేసి ఈ రోజు నుంచి స్పెషల్ స్క్రీనింగ్స్ ని ప్రకటించింది. నారాయణ అండ్ కో, లవ్ యు రామ్ కూడా సేమ్ డేట్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కల్ట్ క్లాసిక్ తొలిప్రేమకి రెస్పాన్స్ భారీగానే ఉండబోతోంది. ఇవి కాకుండా మల్టీప్లెక్సులను టార్గెట్ చేసుకున్న హిందీ ఇంగ్లీష్ సినిమాలు సత్యప్రేమ్ కి కథ, ఇండియానా జోన్స్ డయల్ అఫ్ డెస్టినీలను తక్కువంచనా వేయడానికి లేదు
This post was last modified on June 28, 2023 12:28 pm
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…