సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త చిత్రం గుంటూరు కారం నుంచి లీడ్ హీరోయిన్ పూజా హెగ్డే తప్పుకున్న వార్త నిజమే అనిపిస్తోంది. తమన్ మీద వేటు పడ్డట్లు వచ్చిన వార్తలను ఖండించిన చిత్ర బృందం.. పూజా విషయంలో గప్ చుప్‌గా ఉండటం.. పూజా వైపు నుంచి కూడా సౌండ్ లేకపోవడంతో ఈ వార్త నిజమే అని తేలిపోయింది.
ఈ చిత్రంలో రెండో హీరోయిన్‌గా ఎంపికైన శ్రీలీలనే లీడ్ హీరోయిన్‌గా ప్రమోట్ చేసినట్లు తెలుస్తుండగా.. శ్రీలీల కోసం అనుకన్న పాత్రను ఇప్పుడు ఎవరు చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇటీవలే కొత్త షెడ్యూల్ కూడా మొదలైన నేపథ్యంలో ఈ విషయంలో ఆలస్యం చేసే పరిస్థితి లేదు. ఈ మధ్య త్రివిక్రమ్‌కు ఫేవరెట్ హీరోయిన్‌గా మారిన మలయాళ భామ సంయుక్త పేరు బలంగా వినిపించింది కానీ.. ఆమెను కాకుండా ఎవరూ ఊహించిన ఓ అమ్మాయిని ఈ పాత్రకు ఎంచుకున్నట్లు సమాచారం.
సుశాంత్ మూవీ ఇచట వాహనములు నిలుపరాదు చిత్రంతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన మాజీ మిస్ ఇండియా మీనాక్షి చౌదరిని మహేష్ సరసన రెండో కథానాయికగా ఎంచుకున్నారన్నది తాజా సమాచారం. ఆల్రెడీ ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఒడ్డూ పొడవు బాగా ఉన్న మీనాక్షి మహేష్ పక్కన బాగా సూటవుతుందనడంలో సందేహం లేదు. ఆమెకిది బంపరాఫర్ అనే చెప్పాలి.
సుశాంత్ లాంటి చిన్న హీరో పక్కన కథానాయికగా అరంగేట్రం చేసిన ఆమె.. ఆ తర్వాత రవితేజతో ఖిలాడి, అడివి శేష్‌తో హిట్-2లో నటించింది. ఇప్పుడు ఒక్కసారిగా మహేష్ లాంటి టాప్ స్టార్ సినిమా అంటే పెద్ద ప్రమోషన్ వచ్చినట్లే. ఈ విషయాన్ని చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం గుంటూరు కారం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
This post was last modified on June 24, 2023 8:24 am
ప్రపంచవ్యాప్తంగా విజయ్ అభిమానులను తీవ్ర మనస్థాపానికి గురి చేసిన జన నాయకుడు సెన్సార్ వివాదం ఒక కొలిక్కి వచ్చేసింది. యు/ఏ…
వెండితెరకు చాలా గ్యాప్ తీసుకున్న సమంత త్వరలో మా ఇంటి బంగారంతో కంబ్యాక్ అవుతోంది. జీవిత భాగస్వామి రాజ్ నిడిమోరు…
ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ రాజా సాబ్ థియేటర్లలో అడుగు పెట్టేశాడు. టాక్స్, రివ్యూస్ సంగతి కాసేపు…
ఏ రాష్ట్రంలో అయినా... ప్రతిపక్ష నాయకులకు ప్రభుత్వాలు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వవు. సహజంగా రాజకీయ వైరాన్ని కొనసాగిస్తాయి. ఏపీ సహా…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీలకు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది. శుక్రవారం నుంచి…