హిట్టిచ్చి ఇరుక్కుపోయిన డైరెక్టర్లు

హిట్‍ ఇచ్చిన దర్శకుల వెంట టాలీవుడ్‍ నిర్మాతలు, హీరోలు పడుతుంటారని అంటారు. కానీ ఈ దర్శకులను చూస్తే అది నిజం కాదనిపిస్తుంది. అర్జున్‍రెడ్డి లాంటి సంచలన సినిమా తీసి, తర్వాత అదే చిత్రాన్ని హిందీలో రీమేక్‍ చేసి అంతకంటే పెద్ద హిట్టిచ్చిన సందీప్‍ రెడ్డి వంగా తదుపరి చిత్రం ఇంతవరకు ఖరారు కాలేదు.

ఎంతమంది హీరోల చుట్టూ తిరిగినా కానీ ఇప్పటికి ఎవరూ అతడితో సినిమా చేస్తామని ఖచ్చితంగా చెప్పలేదు. ఆర్‍ఎక్స్100 తీసిన అజయ్‍ భూపతి కథ తెలిసిందే. ఎన్నిసార్లు ప్రాజెక్ట్ ఓకే అయిపోయిందని అనుకున్నా కానీ ‘మహాసముద్రం’ అలలు అసలు పైకి లేవనే లేవడం లేదు. ఈ యువ దర్శకుల కథ ఇలాగుంటే… సీనియర్లు, అద్భుతమైన సినిమాలు తీసిన సుకుమార్‍, కొరటాల శివది మరో వ్యధ.

రెండున్నర సంవత్సరాలుగా ఈ ఇద్దరూ ఒకే సినిమాతో స్టక్‍ అయిపోయి వున్నారు. ప్రస్తుత పరిస్థితులలో మరో ఏడాదికి పైగా నిరీక్షణ తప్పదు. కొరటాల శివ ఈసారి జాగ్రత్త పడి ముందే తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్‍తో ఓకే చేసేసుకున్నాడు. సుకుమార్‍ కూడా పుష్ప ఆలస్యమవుతోంది కనుక ఈలోగా తదుపరి చిత్రం కోసం కథ రెడీ చేసుకుని హీరోని ఫిక్స్ చేసేసుకుంటే బెటరు.

All the Streaming/OTT Updates you ever want. In One Place!