Movie News

టిల్లు హీరో చేతిలో మూడు ఆప్షన్లు

గత ఏడాది డీజే టిల్లు రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకుని ఒక్కసారిగా యూత్ లో ఫాలోయింగ్ పెంచేసుకున్న సిద్దు జొన్నలగడ్డ దాని సీక్వెల్ టిల్లు స్క్వేర్ తప్ప ఇంకో కమిట్ మెంట్ అధికారికంగా ఇవ్వలేదు. మరీ ఇంత గ్యాప్ తీసుకున్నా ఇబ్బందే. అసలే కెరీర్ ఇన్నింగ్స్ చాలా ఆలస్యంగా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో సరైన ప్లానింగ్ అవసరం. ఇప్పుడు తన చేతిలో మూడు ఆప్షన్లున్నాయి. మొదటిది చిరంజీవి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కాంబోలో తెరకెక్కబోయే మూవీ. అందులో శ్రీలీల జోడిగా సిద్దుని లాక్ చేసినట్టుగా వచ్చిన వార్త ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కావాల్సి ఉంది.

నందిని రెడ్డితో ఒక ప్రాజెక్టుకి సిద్దు ఇంతకు ముందే ఓకే చెప్పాడు. అయితే అన్నీ మంచి శకునములే ఫలితం చూశాక స్క్రిప్ట్ ని మరోసారి జాగ్రత్తగా వడబోసే పని పెట్టుకున్నారట. దీని వల్ల కొంత ఆలస్యమయ్యే అవకాశాన్ని కొట్టి పారేయలేం. కామెడీ తగ్గించి మరీ ఓవర్ ఎమోషనల్ గా వెళ్లిపోతున్న నందిని రెడ్డిని తన పాత ఎంటర్ టైన్మెంట్ స్టైల్ కి రమ్మని సిద్దు పర్సనల్ గా అడిగినట్టు వినికిడి. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది తర్వాత చాలా విరామం తీసుకుని కీడా కోలాతో మళ్ళీ డైరెక్టర్ టోపీ పెట్టుకున్న తరుణ్ భాస్కర్ కి సిద్దు ఓకే చెప్పినట్టు తాజా అప్డేట్.

కీడా కోలా రిలీజ్ వరకు తాను నెక్స్ట్ ఎవరితో చేసేది తరుణ్ భాస్కర్ గుట్టుగా ఉంచాలనుకున్నాడు కానీ లీకైతే జరిగిపోయింది. లైనప్ చూస్తే సిద్దు జొన్నలగడ్డ చేయబోయే ముగ్గురు దర్శకులూ సీనియర్లే. టిల్లులో చూసిన బాడీ లాంగ్వేజ్ టైమింగ్ కి బాగా కనెక్ట్ అయిపోయిన యువతను మెప్పించాలంటే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందే. సిద్దు మాత్రం బయట ఎక్కడ కనిపించినా, ఇతర హీరోల సినిమాల ప్రమోషన్ల పాల్గొంటున్నా తన కొత్త కమిట్ మెంట్స్ గురించి మాత్రం చెప్పడం లేదు. టిల్లు స్క్వేర్ వచ్చాకే ఓపెనయ్యేలా ఉన్నాడు. చూద్దాం

This post was last modified on June 23, 2023 8:08 am

Share

Recent Posts

సెటైర్లు సీరియస్‌గా తీసుకోనవసరం లేదు

నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…

52 minutes ago

డబ్బింగ్ సినిమాల రేట్ల పెంపు సబబేనా

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…

60 minutes ago

మార్చాల్సింది జ్ఞానేష్‌నా.. వ్య‌వ‌స్థ‌నా?!

ఒక ఇంట్లో దొంగ ప‌డ్డాడు. న‌గ‌లు, నట్రా దోచుకున్నాడు. య‌జ‌మాని ... ఆ దొంగ‌ను గుర్తించాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.…

2 hours ago

బుమ్రా, పాండ్యా లేకుంటే అంతేనా…

టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…

3 hours ago

గ్రీన్‌కార్డ్ షాక్… ఐటీ కంపెనీలు ఏమంటున్నాయి?

అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…

4 hours ago

తిరుమ‌ల కేంద్రంగా సాయిరెడ్డి విన్యాసాలు స‌క్సెస్ అయ్యేనా?

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కేంద్రంగా వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డి చేస్తున్న రాజ‌కీయాల‌పై ఆస‌క్తికర…

8 hours ago