గాసిప్‍: సుకుమార్‍కి ఇరవై కోట్ల నష్టం?

మామూలుగా కూల్‍గా వుండే సుకుమార్‍ ఇటీవల చాలా ఫస్ట్రేషన్‍లో కనిపిస్తున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే మరి… రంగస్థలం లాంటి బ్లాక్‍బస్టర్‍ ఇచ్చిన తర్వాత అకారణంగా ఒక దర్శకుడు రెండేళ్లు వృధాగా సమయం గడపాల్సి వస్తే ఆమాత్రం విసుగు, కోపం సహజం. మహేష్‍ కోసమని కథ రాస్తూ ఏడాదికి పైగా సమయాన్ని సుకుమార్‍ స్పెండ్‍ చేసాడు.

కానీ సుకుమార్‍ని వెయిటింగ్‍లో పెట్టి అనిల్‍ రావిపూడి చిత్రం చేయడానికి మహేష్‍ డిసైడ్‍ అవడంతో రాత్రికి రాత్రి సుకుమార్‍ అదే కథ అల్లు అర్జున్‍కి చెప్పి ఓకే చేయించుకున్నాడు. అయితే అక్కడే ఒక పొరపాటు చేసాడు. ఆల్రెడీ త్రివిక్రమ్‍ సినిమా కమిట్‍ అయిన అల్లు అర్జున్‍ వెంటనే సుకుమార్‍తో సినిమా చేసే పరిస్థితి లేదు. దాంతో సుకుమార్‍ అక్కడే ఒక ఏడాది ఎదురు చూడాల్సి వచ్చింది. తీరా సినిమా మొదలవుతుందనే సరికి లాక్‍డౌన్‍తో మరింత టైమ్‍ వేస్ట్ అవుతోంది. దీంతో సుకుమార్‍కి అసహనం పెరిగిపోతోందట.

పుష్ప షూటింగ్‍ ఈ ఏడాది చివరకు మొదలవుతుందని అనుకున్నా కానీ తనకు షూటింగ్‍ కంప్లీట్‍ చేయడానికి ఏడాది సమయం పడుతుంది. అంటే 2021 సంక్రాంతికి గానీ రిలీజ్‍ ప్లాన్‍ చేసుకోలేరు. దర్శకుడిగా సినిమాకు పది కోట్లకు పైగా పారితోషికం తీసుకునే సుకుమార్‍కి రెండేళ్లు వృధా పోవడమంటే చాలా నష్టం. ఒక్కోసారి హీరోల కోసం ఎదురు చూడడం కంటే ఎవరు రెడీగా వుంటే వారితో సినిమా చేసేయడం ఉత్తమం.