తొలి రోజు విపరీతమైన నెగెటివ్ టాక్ వచ్చినా సరే.. తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర బలంగానే నిలబడింది ఆదిపురుష్ సినిమా. రిలీజ్ ముంగిట ఉన్న హైప్ వల్ల శుక్రవారం ఈ చిత్రానికి అనూహ్యంగా రూ.140 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
రెండో రోజు వసూళ్లలో డ్రాప్ కనిపించినా.. ఇంత నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు ఆమేర వసూళ్లు రావడం గొప్ప విషయమే. ఆదివారం కూడా వసూళ్లు నిలకడగానే ఉన్నాయి. మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.300 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది ఆదిపురుష్‌కు అద్భుత ఆరంభం అనే చెప్పాలి. ఐతే వీకెండ్ ఊపు చూసి సినిమాను నమ్ముకున్న వాళ్లందరూ సేఫ్ అనుకోవడానికి వీల్లేదు.
ముందు నుంచే వీకెండ్ అంతటికి అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగా జరగడం.. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా వీకెండ్లో సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు రావడంతో ఈ సినిమా ప్రయాణం ఇప్పటిదాకా సాఫీగానే సాగిపోయింది. కానీ సోమవారం నుంచి ఆదిపురుష్ ఎలా నెట్టుకు వస్తుందన్నది ప్రశ్నార్థకం. వీకెండ్ తర్వాత సినిమాకు మంచి టాక్ ఉంటే తప్ప థియేటర్లు నిండవు. హిట్ సినిమాలకు కూడా వీకెండ్ తర్వాత డ్రాప్ ఉంటుంది.
ఆదిపురుష్‌కు ఆ డ్రాప్ కొంచెం ఎక్కువే ఉంటుందని భావిస్తున్నారు. కొందరు ట్రేడ్ పండిట్లయితే సినిమా సోమవారం ఒక్కసారిగా క్రాష్ అవుతుందనే అంచనాలు కూడా వేస్తున్నారు. ఈ సినిమా రూ.270 కోట్ల దాకా షేర్.. రూ.450 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తే తప్ప సేఫ్ జోన్లోకి రాదు. అంత వసూలు కావాలంటే రెండో వీకెండ్ వరకు సినిమా బలంగా నిలబడాలి. మరి ఇంత నెగెటివ్ టాక్ తర్వాత వీక్ డేస్‌లో సినిమా ఏమేర పెర్ఫామ్ చేస్తుందో చూడాలి. మొత్తానికి సోమవారం ఆదిపురుష్‌కు అగ్నిపరీక్ష తప్పదనే చెప్పాలి.
This post was last modified on June 18, 2023 11:13 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…