కెరీర్ ఓ మోస్తరుగా నడుస్తుంటే హీరోయిన్లు పెళ్లి మాటే ఎత్తరు. మీడియా వాళ్లు అడిగినా కూడా పెళ్లి సంగతి దాట వేస్తారు. అలాంటిది వేరే హీరోయిన్లెవరైనా పెళ్లి చేసుకోవాలని ఉంది అని తమకు తాముగా అంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటిది పురుషాధిక్యతను ఎప్పుడూ ప్రశ్నిస్తూ.. హీరోలకు తనేం తక్కువ అన్నట్లుగా వ్యవహరించే కంగనా రనౌత్ తనకు తానుగా పెళ్లి చేసుకోవాలని ఉంది అని మీడియాతో అంటే షాకవ్వాల్సిందే.
ఆమె తాజాగా ఈ వ్యాఖ్యలే చేసి ఆశ్చర్యపరిచింది. ప్రతి దానికీ ఒక సమయం అని ఉంటుంది. నా జీవితంలో అలాంటి సమయం వచ్చినపుడు తప్పకుండా పెళ్లి జరుగుతుంది. పెళ్లి చేసుకోవాలని, నాకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆశగా ఉంది. సరైన సమయంలోనే అది జరుగుతుందని ఆశిస్తున్నా అని కంగనా ఒక ప్రెస్ మీట్లో వ్యాఖ్యానించింది.
రెండేళ్ల కిందటే కంగనా ఓ సందర్భంలో పెళ్లి ప్రస్తావన తెచ్చింది. తన జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారని.. సమయం వచ్చినపుడు అందరికీ తనను పరిచయం చేస్తానని ఆమె అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. రాబోయే ఐదేళ్లలో పెళ్లి చేసుకుని భర్త పిల్లలతో ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఉందని ఆమె అప్పుడు వ్యాఖ్యానించింది. కానీ తర్వాత దాని ఊసు ఎత్తలేదు.
ఐతే ఇప్పుడు తన నిర్మాణంలో తెరకెక్కిన కొత్త చిత్రం టీకూ వెడ్స్ షేరు ప్రమోషన్లలో భాగంగా మీడియా వాళ్లు పెళ్లి గురించి ప్రస్తావిస్తే.. దాని పట్ల ఆసక్తిని ప్రదర్శించింది కంగనా. ఆమె మాటల్ని బట్టి చూస్తే త్వరలోనే పెళ్లి కూతురు అవుతుందేమో చూడాలి. ఇక కెరీర్ విషయానికి వస్తే కంగనా.. ఎమర్జెన్సీ సినిమాలో ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. ఈ చిత్రానికి దర్శకురాలు కూడా కంగనానే కావడం విశేషం.
This post was last modified on June 17, 2023 9:50 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…