యువ కథానాయకుడు నిఖిల్ సిద్దార్థ కొత్త చిత్రం ‘స్పై’పై మంచి అంచనాలే ఉన్నాయి ప్రేక్షకుల్లో. దేశభక్తితో ముడిపడ్డ ఈ కథ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు కనెక్టవుతుందని.. ‘కార్తికేయ-2’ స్థాయిలో ఇది సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 29న రిలీజ్ చేయాలని చాన్నాళ్ల కిందటే నిర్ణయించారు. ఆ దిశగానే సినిమాను ప్రమోట్ చేస్తూ వచ్చారు.
కానీ ఉన్నట్లుండి టీంలో రిలీజ్ విషయమై భేదాభిప్రాయాలు నెలకొన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమాను సమయానికి పూర్తి చేసి పాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసి రిలీజ్ చేయడం తేలిక కాదని హీరో సిద్దార్థ్ అభిప్రాయపడుతుంటే.. నిర్మాత, కథకుడు రాజశేఖర్ రెడ్డి మాత్రం జూన్ 29 రిలీజ్‌కే పట్టుబడుతున్నట్లుగా గుసగుసలు వినిపించాయి. ఇటీవల సినిమా నుంచి ఒక పాటను నిర్మాణ సంస్థ రిలీజ్ చేయగా.. నిఖిల్ దాని గురించి కనీసం ఒక ట్వీట్ కూడా వేయలేదు.
దీంతో హీరో, నిర్మాత మధ్య గొడవలు నిజమే అన్న సందేహాలు మరింత బలపడ్డాయి. ఈ నేపథ్యంలో జూన్ 29న ఈ చిత్రం రిలీజ్ కావడం కష్టమే అనుకున్నారు. కానీ నిఖిల్‌కు నిర్మాత సర్దిచెప్పాడా.. లేక ఆయన మొండిగా రిలీజ్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడా అని తెలియదు కానీ.. జూన్ 29నే సినిమా విడుదలవుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఈ చిత్రాన్ని యుఎస్‌లో రిలీజ్ చేస్తున్న ప్రత్యంగిర సినిమాస్.. జూన్ 28న యుఎస్ ప్రిమియర్స్ కన్ఫమ్ చేస్తూ ట్విట్టర్లో కౌంట్ డౌన్ కూడా మొదలుపెట్టింది. రిలీజ్ డౌట్ ఉంటే మూడు రెండు వారాల ముందు ఇలా కౌంట్ డౌన్ ఇవ్వరు. కాబట్టి 29నే సినిమా వస్తున్నట్లే భావించాలి. మరి హీరో సహకారం లేకుండా ఇలాంటి క్రేజీ సినిమాను నిర్మాత సొంతంగా రిలీజ్ చేసుకోవడం అంటే కష్టమే. కాబట్టి నిఖిల్‌ను ఒప్పించి.. మెప్పించి సినిమాను రిలీజ్‌కు తీసుకెళ్లాలి. మరి ఏం జరుగుతుందో ఏమో చూడాలి.
This post was last modified on June 13, 2023 7:51 pm
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…