Movie News

మూడోసారి ఖాకీ చొక్కాలో సాయిశ్రీనివాస్

ఎన్నో ఆశలు పెట్టుకుని మూడేళ్ళ విలువైన కాలాన్ని ఖర్చు పెట్టుకుని మరీ చేసిన హిందీ ఛత్రపతి రీమేక్ బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కి ఊహించని చేదు ఫలితాన్ని ఇచ్చింది. యావరేజ్ అన్నా అంత ఫీలింగ్ ఉండేది కాదు కానీ మొదటి రోజే నార్త్ ఆడియన్స్ మొహమాటం లేకుండా తిరస్కరించడం బాధ పెట్టి ఉంటుంది. తనకు టాలీవుడ్డే కరెక్టని గుర్తించిన సాయిశ్రీనివాస్ ఆలస్యం చేయకుండా వెంటనే తెలుగు సినిమా మొదలుపెట్టాడు. భీమ్లా నాయక్ తర్వాత  కొంచెం గ్యాప్ తీసుకున్న దర్శకుడు సాగర్ కె చంద్ర పక్కా యాక్షన్ కమర్షియల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు.

దీని పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగిన సంగతి తెలిసిందే. దీనికి టైసన్ నాయుడు టైటిల్ పరిశీలనలో ఉంది. ఫిలిం ఛాంబర్ లో ఆల్రెడీ రిజిస్టర్ చేశారని ఇన్ సైడ్ టాక్. ఇది పోలీస్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట. బెల్లం హీరో ఇప్పటిదాకా రెండు సార్లు ఖాకీ యునిఫార్మ్ వేసుకున్నాడు. మొదటిసారి కవచంలో కనిపిస్తే ఫెయిల్యూర్ ఎదురయ్యింది. తర్వాత రాక్షసుడు రూపంలో మంచి విజయం దక్కించుకున్నాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి  పోలీస్ దుస్తులు వేసుకుంటున్నాడు. అయితే  వాటిలోలా ఈ క్యారెక్టర్ ఓవర్ సీరియస్ గా ఉండదట.

మంచి మాస్ అంశాలతో గబ్బర్ సింగ్, పటాస్ తరహా క్యారెక్టరైజేషన్ ని సాగర్ చంద్ర డిజైన్ చేసినట్టు తెలిసింది. ఎలాగూ భీమ్లాలో పవన్ ని  హ్యాండిల్ చేసిన అనుభవం వచ్చేసింది. అంత పెద్ద స్టార్ ని ఆ స్థాయిలో ప్రెజెంట్ చేయగలిగినప్పుడు సాయిశ్రీనివాస్ విషయంలో ఇబ్బంది ఏముంటుంది. టైసన్ నాయుడు కోసం భారీ సెట్లు కూడా వేస్తున్నారు. కాకపోతే ఇంకా హీరోయిన్ లాక్ చేయలేదు. శ్రీలీల కోసం ట్రై చేశారట కానీ డేట్ల సమస్య వల్ల డ్రాప్ అయ్యారట. టాలీవుడ్ లో ఆప్షన్స్ తగ్గిపోవడంతో నార్త్ భామని లేదా కొత్తమ్మాయిని పరిచయం చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉందని సమాచారం

This post was last modified on June 13, 2023 6:25 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

3 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

4 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

4 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

4 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

5 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

5 hours ago