నిముషాలు గంటల్లా మార్చుకుని తెలుగు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న అనుమతులు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేశాయి. అయితే ముందే ఊహించినట్టు కొన్ని మెలికలైతే పెట్టారు. 50 రూపాయల పెంపుని కేవలం సింగల్ స్క్రీన్లకు పరిమితం చేస్తూ జిఓ జారీ చేసింది. అంటే మల్టీప్లెక్సులకు గరిష్ట ధర 295 ఉంటుంది. దీనికి త్రీడి ఛార్జీలు ప్లస్. దీన్ని బట్టి ఆర్ఆర్ఆర్ లాగా విపరీత రేట్లకు ఆస్కారం లేకపోవడం నైజామ్ ప్రేక్షకులకు ఒక రకంగా శుభవార్తే. సింగల్ హాళ్లకు సైతం 225 మించే ఛాన్స్ లేదు. ఏ క్షణమైనా బుక్ మై షో, పేటిఎంలో సేల్స్ మొదలుపెడతారు
మరో శుభవార్త ఏంటంటే ఫస్ట్ డే ఆరో ఆటకు పర్మిషన్ ఇవ్వడం. ఉదయం 4 గంటలతో మొదలుపెట్టి ఈ రోజు మొత్తం ఆరు షోలు వేసుకోవచ్చు. ఇది సానుకూల నిర్ణయం. పైన చెప్పిన పెంపు కేవలం మూడు రోజులు అంటే ఆదివారం వరకే పరిమితం చేశారు. మండే నుంచి పాత రేట్లే ఉంటాయి. నిజానికి డిస్ట్రిబ్యూటర్లు ఈ స్లాట్ నే కోరుకున్నారు. ఎంత ఆదిపురుష్ మీద క్రేజ్ ఉన్నా స్కూళ్ళు తెరిచేసి సెలవులు పూర్తయిన టైంలో మరీ ఎక్కువ రేట్లు పెడితే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఆశించిందే వచ్చింది. సో హైదరాబాద్ లో తెల్లవారకుండానే షోలు షురూ అన్నమాట
ఇక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూడా ఇదే 50 రూపాయల అనుమతి రానుంది. కాకపోతే అక్కడ మల్టీప్లెక్స్ బేసిక్ ప్రైస్ 177 కాబట్టి తెలంగాణతో పోలిస్తే మరీ తీవ్రంగా ఉండబోదు. సింగల్ స్క్రీన్లలో అక్కడ అమలులో ఉన్న ధర 110. సో ఫైనల్ గా 160 మించదు. మొత్తం 185 కోట్లకు హక్కులు కొన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆదిపురుష్ ఫలితం మీద చాలా నమ్మకంగా ఉంది. ఉదయం ఆటకు పాజిటివ్ టాక్ వస్తే చాలు వసూళ్ల సునామి ఖాయం. నార్త్ లోనే ఆ రేంజ్ భీభత్సం కనిపిస్తుంటే ప్రభాస్ హోమ్ గ్రౌండ్ అయిన తెలుగు రాష్ట్రాల్లో అరాచకం గురించి వేరే చెప్పాలా
This post was last modified on June 13, 2023 6:22 pm
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…