సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే గంటలు కాదు రోజులు సరిపోవు. టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు చిన్నా చితక ఆర్టిస్టులు అందరితోనూ స్క్రీన్ పంచుకున్న సుదీర్ఘ అనుభవం ఆయనది. ఇటీవలే జరిగిన ఓ సన్మాన కార్యక్రమంలో కోట హీరోల రెమ్యునరేషన్ల గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఎన్టీఆర్ నుంచి శోభన్ బాబు దాకా ఒకప్పుడు ఎవరూ తమ పారితోషికాలను బయటికి చెప్పేవారు కాదని, కానీ ఇప్పుడు మైకు పట్టుకుని నాకు రోజుకు రెండు కోట్లు నాలుగు కోట్లు ఇస్తున్నారని పబ్లిక్ గా ఒప్పేసుకుంటున్నారని ఇది మంచి పద్దతి కాదనే రీతిలో అన్నారు.
ఇక్కడ నెటిజెన్లతో పాటు సాధారణంగా తలెత్తే లాజిక్ ఒకటుంది. హీరోలే కాదు ఏ మనిషైనా తనకు వచ్చే ఆదాయాన్ని చెప్పుకోవడం తప్పేమీ కాదు. దాని కోసం టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రత్యేక మినహాయింపు లేదు. ఫలానా కంపెనీ లేదా సిఈఓ నాకు ఇంత ఇన్కమ్ వచ్చిందని బాహాటంగా చెబుతున్నప్పుడు స్టార్లు ఓపెన్ కావడం రాంగంటే ఎలా. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి అన్నదే అయినప్పటికీ రాజకీయంలో ఉన్నారు కాబట్టి ఆ మాత్రం నిజం ధైర్యంగా చెప్పడం విశేషమే. వందల కోట్ల బిజినెస్ చేసే సినిమాల్లో నటిస్తున్నప్పుడు నాకు ఇంత ఇస్తున్నారని చెప్పడం ముమ్మాటికీ రైటే
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఇతర బాషల నటీనటులను తీసుకోవడం పట్ల ఓ సందర్భంలో కోట తీవ్రంగా ఆక్షేపించారు. కానీ ఈయనే తమిళంలో సామీ, సెల్యూట్ లాంటి చిత్రాల్లో నటించిన ప్రస్తావిస్తే మాత్రం దాటవేత సమాధానం ఇచ్చేవారు. కార్పొరేట్ బ్రాండ్లకు కేవలం స్టార్లనే తీసుకోవడం పట్ల కూడా కోట అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా క్రికెట్ లో ధోని, కోహ్లీలతో యాడ్స్ చేయిస్తారు కానీ రవిశాస్త్రి, హర్షా భోగ్లేలతో కాదుగా. అప్పుడప్పుడు ఇలాంటి స్టేట్ మెంట్స్ వార్తల్లో నిలిచే కోట శ్రీనివాసరావుగారు ఆరోగ్యం దృష్ట్యా సినిమాలు తగ్గించారు కానీ అడపాదడపా కనిపిస్తూనే ఉంటారు
This post was last modified on June 3, 2023 3:18 pm
స్విట్జర్లాండ్లోని దావోస్లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు టాప్ జాబ్ విషయంలో పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ…
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్…
ఏపీ సీఎం చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరో జన్మ అంటూ ఉంటే.. మళ్లీ తెలుగు వాడిగానే…