Movie News

2 దశాబ్దాల తర్వాత గురూజీ పాటలు

అదేంటి త్రివిక్రమ్ సినిమాల పాటలు క్రమం తప్పకుండా వింటున్నాం కదా మళ్ళీ ఇదేంటి కొత్తగా అనుకుంటున్నారా. మాటల రచయితగా తన పదాల కనికట్టుతో మాయ చేసే ఈయనలో ఓ లిరిక్ రైటర్ ఉన్నారన్న విషయం వీర ఫ్యాన్స్ కు మాత్రమే గుర్తుంటుంది. నిన్న రిలీజైన గుంటూరు కారం టీజర్ లో వచ్చే బిట్ సాంగ్ రాసింది గురూజీనే. గత ఏడాది భీమ్లా నాయక్ లో లాలా అడవి పులి వచ్చింది కూడా ఈ కలం నుంచే. అయితే త్రివిక్రమ్ పాటలు రాయడం ఇది మొదటిసారి కాదు. ఇరవై ఏళ్ళ క్రితమే తన ప్రాసల మేజిక్ ని ప్రేక్షకులకు రుచి చూపించారు. కానీ జనానికి చేరలేదు

2003లో రవితేజ నమిత హీరో హీరోయిన్లుగా ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన సినిమా ఒక రాజు ఒక రాణి. దర్శకుడు యోగి. చక్రి సంగీతం సమకూర్చారు. అందులో మంచి పాటలు పడ్డాయి. స్వరాల వీణ ఈ వేళలోనా అంటూ క్యాచీగా ఉండే సాంగ్స్ తో చక్కని ఆల్బమ్ ఇచ్చారు. అయితే మాస్ మహారాజాకు అప్పుడున్న ఇమేజ్ కి ఇంత సాఫ్ట్ లవ్ స్టోరీలో ఆడియన్స్ చూడలేకపోయారు. దీంతో ఎంత పబ్లిసిటీ ఇచ్చి ప్రమోషన్లు చేసినా ఫలితం దక్కలేదు. పెద్ద క్యాస్టింగ్ ఉన్నా లాభం లేకపోయింది. రామోజీరావు సంస్థ అనే కారణంతో రవితేజ ఎక్కువ ఆలోచించకుండా చేసిన మూవీ ఇదే

పాటలు త్రివిక్రమ్ రాశారన్న టాక్ ఆ టైంలో పబ్లిక్ లోకి బాగా వెళ్ళింది. కానీ ఫలితం మాత్రం తేడా కొట్టింది. ఇక అప్పటి నుంచి ఆయన కేవలం మాటలు దర్శకత్వానికి మాత్రమే పరిమితమయ్యారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కోసం లిరిక్ రైటర్ కి పని చెప్పడం విశేషం. ఎడాపెడా చూడం ఇది ఎర్రెక్కించే బేరం,  సరా సరా శూలం సుర్రాంటాది కారం, ఇనుప చువ్వ కౌకు దెబ్బ ఇరగదీసే రవ్వలదెబ్బ అంటూ తన మార్కు ఇందులోనూ చూపించడం విశేషం. దీనికొకటే పరిమితమవుతారా లేక ఇంకో రెండు మూడు పాటలకు కలం విదిలిస్తారా చూడాలి 

This post was last modified on June 2, 2023 8:52 am

Share

Recent Posts

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

38 minutes ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

44 minutes ago

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

2 hours ago

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

4 hours ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

6 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

7 hours ago