ఇండస్ట్రీలో ఏ కథ ఏ హీరో దగ్గరికి వెళ్తుందో చెప్పలేం. హీరోలు కథలు చాలానే ఉన్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ తర్వాత సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. నిజానికి భీమ్లా నాయక్ కంటే ముందు సాగర్ కే చంద్ర వరుణ్ తేజ్ తో ఓ సినిమా లాక్ చేసుకున్నాడు. దాదాపు రెండు మూడేళ్లు 14 రీల్స్ ఆఫీస్ లోనే ఆ ప్రాజెక్ట్ పై వర్క్ చేశాడు. ఏమైందో తెలియదు కానీ మళ్ళీ సితార లో ఇంకో కథ చెప్పాడు. ఆ కథను పక్కన పెట్టించి సాగర్ కే చంద్ర కి పవన్ రీమేక్ సినిమా అప్పగించారు.
అయితే పవన్ సినిమా తర్వాత మళ్ళీ వరుణ్ తేజ్ తో సాగర్ సినిమా ఉంటుందనుకునే లోపే బెల్లంకొండ శ్రీనివాస్ తో నెక్స్ట్ సినిమా లాక్ చేసుకున్నాడు. వరుణ్ తేజ్ కోసం వర్క్ చేసిన 14 రీల్స్ సంస్థ లోనే ఈ సినిమా చేస్తున్నాడు సాగర్. దీంతో వరుణ్ తేజ్ కి ప్లాన్ చేసిన కథతోనే ఇప్పుడు దర్శక నిర్మాతలు బెల్లంకొండ శ్రీనివాస్ తో మూవీ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది.
నిజానికి యంగ్ హీరో కోసం రాసుకున్న కథ సీనియర్ హీరోకి సూటవ్వక పోవచ్చు కానీ అదే ఏజ్ గ్రూప్ హీరో దొరికితే మాత్రం తాను వర్క్ చేసి ఎంతో నమ్మిన కథతోనే దర్శకులు పట్టాలేక్కిస్తుంటారు. సొ సాగర్ కే చంద్ర కూడా అదే చేస్తుండొచ్చు. తాజాగా ఈ కాంబో సినిమా మొదలైంది. జూన్ నుండి రెగ్యులర్ ఘాట్ జరుపుకోనుంది.
This post was last modified on June 1, 2023 10:07 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…