బ్లాక్ బస్టర్స్ విషయంలో నిర్మాతలు వాటి నిర్మాణ సమయంలోనే ఓటిటి డీల్స్ కి టెంప్ట్ కావడం వల్ల థియేట్రికల్ రెవిన్యూ దెబ్బ తింటోంది. ముఖ్యంగా ఆలస్యంగా డబ్బింగ్ జరుపుకున్న వాటికి ఈ సమస్య మరింత తీవ్రం. ఇటీవలి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ 2018 కేరళలో మే 5 రిలీజయ్యింది. కేవలం మూడు వారాల్లోపే నూటా యాభై కోట్లతో మోహన్ లాల్ ఆల్ టైం టాప్ 2ని పెద్ద మార్జిన్ తో దాటేసింది. రెండు వందల కోట్లు ఖాయమని బయ్యర్లు గట్టి నమ్మకంగాతో ఉన్నారు. ఈలోగా సోనీ లైవ్ దీని డిజిటల్ స్ట్రీమింగ్ ని జూన్ 7 చేయబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించింది.
తెలుగు ఆడియో ఇవ్వకపోవచ్చు కానీ ఇక్కడ రిలీజై పట్టుమని అయిదు రోజులు కాలేదు. ఈలోగా ఓటిటి వార్త తెలిస్తే థియేటర్ కు వెళదామనుకున్న ఆడియన్స్ ఆగిపోతారు. ఒరిజినల్ వెర్షన్ నే సబ్ టైటిల్స్ తో చూసేద్దామనే బాపతు లేకపోలేదు. ఇప్పటికే ఏపీ తెలంగాణలో 2018కి స్లో పికప్ ఉంది. నాలుగు రోజులకు అయిదు కోట్లు దాటేసి మేం ఫేమస్ ని డామినేట్ చేస్తోంది. అలాంటప్పుడు డిజిటల్ అనౌన్స్ మెంట్లు రాకపోతేనే బెటర్. సరే ఇప్పుడు దాన్ని ఎలాగూ వెనక్కు తీసుకోలేరు కానీ ఇకనైనా జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరికగా దీన్ని తీసుకోవాలి
మల్లువుడ్ డిస్ట్రిబ్యూటర్లు దీని మీద భగ్గుమంటున్నారు. మంచి రన్ లో సినిమాని ఇలా ఓటిటిలకు ఇస్తే భవిష్యత్తులో తమ నుంచి నిరసన ఎదురుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వాళ్ళ ఆవేదనలో న్యాయం లేకపోలేదు. ఎందుకంటే నెలల తరబడి డల్లుగా ఉన్న కేరళ బాక్సాఫీస్ కు జవసత్వాలు తీసుకొచ్చింది 2018నే. చాలా రోజుల తర్వాత హౌస్ ఫుల్ బోర్డులు చూసి ఎగ్జిబిటర్ల సంతోషం అంతా ఇంతా కాదు. తీరా చూస్తే ఇప్పుడీ ఓటిటి న్యూస్ తో 33 రోజులకే సినిమాని కిల్ చేస్తున్నారని వాపోతున్నారు. అంతా అయిపోయాక ఎవరు మాత్రం చేయగలిగింది ఏముంది
This post was last modified on May 30, 2023 10:37 am
శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్ను సాగిస్తున్న…