తమిళ కథానాయిక త్రిషకు ఈ మధ్యే 40 ఏళ్లు నిండాయి. ఈ వయసులో హీరోయిన్ వేషాలు పక్కన పెట్టి.. క్యారెక్టర్ రోల్స్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. కానీ త్రిష మాత్రం ఇంకా చెక్కు చెదరని అందంతో.. భారీ సినిమాల్లో లీడ్ రోల్స్‌తో అభిమానులను అలరిస్తోంది. ఈ మధ్యే పొన్నియన్ సెల్వన్-2లో తన అందం, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి అభిమానులు మైమరిచిపోయారు.
మధ్యలో కెరీర్ డౌన్ అయి ఇక సినిమాలే మానేయాల్సిన స్థితిలో కనిపించిన త్రిష.. ఈ మధ్య చేస్తున్న, చేయబోతున్న సినిమాల వరుస చూస్తే షాకవ్వక తప్పదు. ఆల్రెడీ విజయ్ లాంటి టాప్ స్టార్‌తో లియో సినిమాలో కథానాయికగా నటిస్తోంది త్రిష. ఇప్పుడు అజిత్‌తో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు సమాచారం.
అజిత్ హీరోగా మగిల్ తిరుమణి ఓ సినిమా రూపొందించబోతున్నాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. ఇందులో కథానాయికగా త్రిష దాదాపుగా ఓకే అయినట్లు సమాచారం. ఒక తరం స్టార్ హీరోయిన్లతో నటించాక స్టార్ హీరోలు.. కొత్త తరం హీరోయిన్ల వైపు మొగ్గుతుంటారు.
హీరోలకు ఎంత వయసొచ్చినా పర్వాలేదు కానీ.. హీరోయిన్ల విషయంలో అలా ఉండదు. పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంటుంది. కానీ నయనతార, త్రిష లాంటి హీరోయిన్లు మాత్రం ఇంకా తమ హవా నడిపిస్తూ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ చేయనున్న కొత్త చిత్రంలోనూ త్రిష కథానాయికగా నటించనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on May 25, 2023 5:51 pm
ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీ…