ఈ ఏడాది భారీ సినిమాల సందడి లేక సినీ ప్రేక్షకులు కొంత నిరాశలోనే ఉన్నారు. ముఖ్యంగా వేసవి పెద్ద సినిమాలు లేక వెలవెలబోయిందనే చెప్పాలి. ఇక ప్రేక్షకుల దృష్టంతా జూన్‌లో రిలీజ్ కానున్న ‘ఆదిపురుష్’ మీదే ఉంది.
ప్రభాస్ ఇందులో హీరోగా నటించడం.. ‘తానాజీ’ దర్శకుడు ఓం రౌత్ దీన్ని రూపొందించడంతో.. పైగా టీజర్ రిలీజైనప్పటి నుంచి ఈ సినిమా మీద విపరీతమైన చర్చ జరగడంతో అందరి దృష్టీ దీని మీద నిలిచింది. ఈ మధ్యే రిలీజైన ట్రైలర్.. టీజర్ తర్వాత వచ్చిన నెగెటివిటీని చాలా వరకు చెరిపేసిందనే చెప్పాలి. ‘ఆదిపురుష్’ రిలీజ్‌కు సమయం దగ్గర పడుతోంది. ఇంకో మూడు వారాల్లోనే ఆ సినిమా విడుదల కాబోతోంది. ఇండియాలో రిలీజ్ హడావుడికి వారం ముందు కానీ మొదలు కాదు. కానీ విదేశాల్లో మాత్రం భారీ చిత్రాలకు కొన్ని వారాల ముందు నుంచే హంగామా ఆరంభమవుతుంది.
‘ఆదిపురుష్’ విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ సినిమా విడుదలక నెల రోజుల ముందే యుఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. సినిమా మీద ఇంతకుముందున్న నెగెటివిటీ అంతా కొట్టుకుపోయిందనడానికి ప్రి సేల్స్ నిదర్శనంగా నిలుస్తున్నాయి. విడుదలకు ఇంకా 22 రోజులు ఉండగానే యుఎస్‌లో టికెట్ల అమ్మకాలు మొదలైన 9 లొకేషన్లలో ప్రి సేల్స్ జోరుగా నడుస్తున్నాయి.
ఇప్పటికే ‘ఆదిపురుష్’ అక్కడ 7 వేల డాలర్ల దాకా కలెక్ట్ చేసింది. ఇది యుఎస్ ప్రిమియర్స్‌కు మంచి ఆరంభమే. రిలీజ్ టైంకి ఈ సినిమా ప్రి సేల్స్‌తోనే అలవోకగా మిలియన్ మార్కును టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. నిజానికి ‘ఆదిపురుష్’ రిలీజ్‌కు నాలుగు రోజుల ముందే యుఎస్‌లో జరగనున్న ఫిలిం ఫెస్టివల్‌లో స్పెషల్ ప్రివ్యూ ప్లాన్ చేశారు. దాని టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కానీ ఏవో కారణాలతో ఆ షో క్యాన్సిల్ అయింది. ఇప్పుడు రెగ్యులర్ ప్రిమియర్స్‌కు బుకింగ్స్ ఓపెన్ చేస్తే స్పందన ఆశాజనకంగానే ఉంది.
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…