డైరెక్టర్ మారుతి ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో పెద్ద హిట్టే కొట్టాడు. అయితే ఇంతవరకు అతని మలి చిత్రానికి హీరో ఎవరనేది ఖరారు కాలేదు. అగ్ర హీరోలు ఎలాగో మారుతితో సినిమా చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇక మిడిల్ రేంజ్ హీరోలలోను అందరూ చాలా సినిమాలతో బిజీగా వున్నారు. కరోనా బ్రేక్ వల్ల అందరి షెడ్యూల్స్ దెబ్బ తినేసాయి.
షూటింగ్ మొదలయి… సగంలో వున్న సినిమాలు, ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలు పూర్తి చేయడానికే హీరోలు ప్రిఫర్ చేస్తున్నారు. రామ్‌తో చేయాలని మారుతి గట్టిగా ప్రయత్నించినా కానీ ఇంకా అతడి నుంచి ఖచ్చితమైన స్పందన రాలేదు. వరుణ్ తేజ్‌తో చేయాలనే ప్లాన్ వుంది కానీ అతనికీ వేరే కమిట్మెంట్స్ వున్నాయి కనుక ఇప్పట్లో కుదరదు. నాని మరోసారి ‘భలే భలే మగాడివోయ్’ దర్శకుడితో చేయాలని ఉబలాటపడుతున్నా కానీ అతను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలంటే 2022 వరకు వేచి చూడాల్సి వస్తుంది.
షూటింగ్స్ మళ్లీ మొదలయ్యాక సినిమా మొదలు పెట్టాలన్నా కానీ మారుతికి ఇప్పుడు రెడీగా హీరో లేడు. ఎప్పటికప్పుడు కొత్త సినిమా చేస్తూ బిజీగా వుండే దర్శకుడికి ఇది కాస్త ఇబ్బందికర పరిణామమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates