వరసగా ఫ్లాపుల దెబ్బలు తగలడం నాగచైతన్యకు మాములు షాక్ ఇవ్వలేదు. థాంక్ యు పోతుందని ఎడిటింగ్ టేబుల్ మీదే తెలిసిపోయిందని ఓపెన్ గా ఒప్పుకున్న చైతు కస్టడీ విషయంలో మాత్రం చాలా నమ్మకం చూపించాడు. అందుకే ప్రమోషన్లు ఎంత అగ్రెసివ్ గా ప్లాన్ చేసినా కాదనకుండా పాల్గొన్నాడు. తీరా చూస్తే కెరీర్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలవడం ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. పైగా ఏజెంట్ చేదు జ్ఞాపకం ఇంకా పచ్చిగా ఉండగానే ఇలా జరగడం పట్ల సోషల్ మీడియాలో వాళ్ళు చూపిస్తున్న ఆవేదన అంతా ఇంతా కాదు.
ఇది కాసేపు పక్కనపెడితే చైతు ఓటిటి డెబ్యూ దూత వెబ్ సిరీస్ ఎప్పుడు వస్తుందనే భేతాళ ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు. షూటింగ్ పూర్తి చేసుకుని చాలా కాలమయ్యింది. నెలల క్రితమే ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది చేసి పాత్రలను పరిచయం చేశారు. అమెజాన్ ప్రైమ్ భారీ బడ్జెట్ తో దీన్ని తెరకెక్కించింది. అయితే ఈ జాప్యం వెనుక కారణాలు వేరే ఉన్నాయని తెలిసింది. ప్రస్తుతం నాగ చైతన్య మార్కెట్ బాగా డల్ గా ఉంది. ఒకవేళ లాల్ సింగ్ చద్దా, థాంక్ యులో ఒకటి హిట్టయినా పరిస్థితి వేరుగా ఉండేది. కానీ జరగలేదు. దీంతో ప్రైమే వాయిదా వేస్తూ పోతోందని ఇన్ సైడ్ టాక్
ప్యాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల్లో ప్రమోట్ చేయాలి కాబట్టి హీరో దర్శకుడి ఇమేజ్ చాలా కీలకమవుతాయి. విక్రమ్ కుమార్ కు సైతం థాంక్ యు దెబ్బ బలంగా తగిలింది. అసలే దూత హారర్ జానర్. వీటికి ఓటిటి ప్రేక్షకులు ప్రత్యేకంగా ఉంటారు కానీ ఫైనల్ అవుట్ ఫుట్ పట్ల అమెజాన్ టీమ్ అంత సంతృప్తికరంగా లేకపోవడం వల్లే కొన్ని కీలక మార్పులకు రికమండ్ చేశారని వాటిని సరిచేసే పని ఆలస్యమవుతోందని మరో వెర్షన్ వినిపిస్తోంది. గత ఏడాది దీపావళి నుంచి అదిగో ఇదిగో అంటున్నారే తప్ప దూతకు మోక్షం కలిగించే ముహూర్తం దగ్గరలో కనిపించడం లేదు
This post was last modified on May 15, 2023 1:29 pm
అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చాక దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ…
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…