మనం ఇప్పటికీ వందల వేల సార్లు చూసేసి అరగేసిన సినిమా కాబట్టి ఛత్రపతి హిందీ రీమేక్ వెర్షన్ ని తెలుగు రాష్ట్రాల్లో ఏమంత భారీ స్థాయిలో రిలీజ్ చేయలేదు .కేవలం నార్త్ మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని అక్కడ మాత్రమే ఎక్కువ ప్రమోట్ అయ్యేలా జాగ్రత్త పడ్డారు. పెన్ స్టూడియోస్ నిర్మాణం కావడంతో ప్రత్యేకంగా బాలీవుడ్ సెలబ్రిటీలకు ఒక షో కూడా వేశారు. ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి రూపొందించిన ఐబి 71 తప్ప నార్త్ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ పోటీ లేదు. పూర్తిగా ఉత్తరాది మాస్ ని టార్గెట్ చేసిన బెల్లం ఛత్రపతి ఎంతవరకు మెప్పించాడనే ఆసక్తి జనాల్లో ఉండటం సహజం.
కథ పరంగా మళ్ళీ చెప్పడానికి ఏమి లేదు. కొన్ని మార్పులతో విజయేంద్ర ప్రసాద్ స్టోరీని యథాతథంగా తీసుకున్నారు. అయితే ఒరిజినల్ వెర్షన్ తో పోలిస్తే నలభై నిమిషాలకు పైగానే కోత వేసి కేవలం 2 గంటల 3 నిమిషాలకే ఛత్రపతిని కుదించడం విశేషం. సాయి శ్రీనివాస్ ని మాస్ యాక్షన్ అవతారంలో చూపించడంలో దర్శకుడు వివి వినాయక్ సక్సెస్ అయ్యాడు. అయితే ప్రభాస్ సినిమాకు ఏదైతే ఆయువుపట్టుగా నిలిచిందో ఆ మదర్ సెంటిమెంట్ ని ఇందులో పూర్తిగా కట్ షార్ట్ చేసి హీరోయిజం ఎలివేషన్లకు ప్రాధాన్యం ఇవ్వడం కామం ఆడియన్స్ కు అంతగా రుచించదు.
హీరోయిన్ నుస్రత్ బరుచా పాత్రకు పెద్దగా స్కోప్ దక్కలేదు. మనకు కీరవాణి సంగీతం ప్రాణంగా నిలిచింది. అయితే అక్కడ తనిష్క్ బాగ్చి పాటలు క్లిక్ అయ్యేలా లేవు. కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సౌండ్ ఎక్కువ సోల్ తక్కువగా మిగిలింది. ఫోకస్ మొత్తం హీరో పాత్రకు షిఫ్ట్ చేయడంతో మన ఛత్రపతిలో కీలకంగా నిలిచిన భానుప్రియ, షఫీ, ప్రదీప్ రావత్, కోట లాంటి క్యారెక్టర్లు స్కోప్ తగ్గిపోవడంతో పాటు సరైన ఆర్టిస్టులు కుదరక తేలిపోయాయి. ఓవరాల్ గా సాయిశ్రీనివాస్ లో మాస్ మెటీరియల్ ఉందని చెప్పడానికి మాత్రమే ఛత్రపతి ఉపయోగపడింది కానీ పర్ఫెక్ట్ రీమేక్ అనిపించుకోవడానికి కాదు.
This post was last modified on May 12, 2023 9:24 pm
ఐపీఎల్-2025 మెగా వేలం ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్ లలో అత్యంత ఆదరణ, ఆదాయం ఉన్న ఐపీఎల్ టోర్నీ 18వ…
ప్రముఖ వ్యాపార వేత్త, ప్రపంచ కుబేరుడు గౌతం అదానీ.. ఏపీలో సౌర విద్యుత్‌కు సంబంధించి చేసుకున్న ఒప్పందాల వ్యవహారంలో అప్పటి…
కేంద్రంలోని బీజేపీ పెద్దలు మహా ఆనందంగా పార్లమెంటుకు వచ్చారు. సోమవారం నుంచి ప్రారంభమైన.. పార్లమెంటు శీతాకాల సమావేశాలను ప్రతిష్టాత్మకంగానే కాదు..…
సోలార్ విద్యుత్ ఒప్పందాల నేపథ్యంలో అదానీ గ్రూప్ పై లంచం ఇచ్చారన్న ఆరోపణలు రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.…
ఐపీఎల్ 2025 కోసం జరుగుతున్న ఆటగాళ్ల వేలంలో బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ మెగా…
టీడీపీ నాయకుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీరు మారలేదు. ప్రస్తుతం ఉన్న నాయకుల్లో చాలా మంది ఫొటోలకు ఫోజులు…