7 సినిమాలున్న సంగతే మర్చిపోయారు

రేపు శుక్రవారం విడుదల కాబోతున్న కొత్త సినిమాలేవంటే సగటు జనాలకు నాగ చైతన్య కస్టడీ తప్ప ఇంకేదీ గుర్తురావడం లేదు. రెగ్యులర్ మూవీ లవర్స్ కూడా ఇదొక్కటే కదానే భావనలో ఉన్నారు. నిజానికి ఇంకో ఏడు చిత్రాలు థియేటర్లకు వస్తున్నాయని అదే పనిగా చెప్తే తప్ప ఫ్లాష్ కాని పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం పబ్లిసిటీ లోపమే. ఏదో ఒకటి రెండు ప్రెస్ మీట్లు పెట్టేసి టీజర్ ట్రైలర్ ని ఆన్ లైన్ లో వదిలి మమ అనిపిస్తున్నారు తప్పించి నిజంగా జనానికి చేరువ చేసే ప్రయత్నాలు సీరియస్ గా జరగని మాట వాస్తవం. అలాంటపుడు షోస్ క్యాన్సిల్ కావని ఎవరు చెప్పగలరు.

భువన విజయం టైటిల్ కు తగ్గట్టే ఏదో డిఫరెంట్ గా ట్రై చేసిన ఫీల్ పోస్టర్లు వీడియోలు చూసినప్పుడు కలిగింది. దాన్ని రేస్ లో పెట్టారు. కల్యాణమస్తు, కథ వెనుక కథ, టీ బ్రేక్, ది స్టోరీ అఫ్ బ్యూటిఫుల్ గర్ల్ ఇలా చెప్పుకుంటూ పోతే వీటిలో హీరో హీరోయిన్ లెవరో కూడా వెంటనే గుర్తు రాని సిచువేషన్. శ్రేయ శరన్ ప్రధాన పాత్ర పోషించిన మ్యూజిక్ స్కూల్ వస్తోంది. ఇళయరాజా సంగీతం సమకూర్చారు. తెలంగాణ మంత్రి కెటిఆర్ అతిథిగా ఈవెంట్ కూడా చేశారు. అయినా జనంలోకి కనీసం టైటిల్ కూడా వెళ్ళలేదు. ఐశ్వర్య రాజేష్ డబ్బింగ్ మూవీ ఫర్హానా చప్పుడు లేకుండా వస్తోంది.

ఇవి కాకుండా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఛత్రపతి ఉండనే ఉంది. ఘాజీ – అంతరిక్షం ఫేమ్ సంకల్ప్ రెడ్డి హిందీలో రూపొందించిన ఐబి 71 సైలెంట్ గా దిగుతోంది. ఇవి కాకుండా బాలీవుడ్ హాలీవుడ్ కలిపి మరో నాలుగు రిలీజులున్నాయి. వేసవి సెలవుల్లో ఇన్నేసి సినిమాలు రావడం మంచిదే కానీ థియేటర్లను కనీసం మొదటి రోజు నింపలేని నిస్సహాయతను మార్చాలంటే ఎంత కంటెంట్ ఉన్నా సరే దాన్ని మార్కెటింగ్ చేసుకునే న నైపుణ్యం ఉండాలి. కేవలం ఓటిటి సంస్థల కండీషన్ల కోసమే అయితే ఇదంతా వృధా ప్రయాసే. వీటిలో ఏదైనా సర్ప్రైజ్ ఇచ్చి మెప్పిస్తుందేమో చూడాలి.