బహుశా ఆదిపురుష్ అనే సినిమా టీజర్‌కు వచ్చిన నెగెటివ్ రెస్పాన్స్.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఏ ప్రముఖ చిత్రం ప్రోమోకు వచ్చి ఉండదేమో. గత ఏడాది భారీ అంచనాల మధ్య రిలీజైన ఆదిపురుష్ టీజర్.. మెజారిటీ జనాలకు ఏమాత్రం రుచించలేదు. అసహజంగా ఉన్న పాత్రల గెటప్స్, విజువల్ ఎఫెక్ట్స్ టీజర్ మీద తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయి.
తర్వాత మీడియాకు త్రీడీ టీజర్ ప్రత్యేకంగా ప్రదర్శించినా, ఇంకేవో ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం లేకపోయింది. సోషల్ మీడియాలో వ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోయి సినిమాను ఐదు నెలల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. పాత్రల లుక్స్‌తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ మీద టీం మళ్లీ పని చేసింది. రిలీజ్ కోసం జూన్ 16కు కొత్త డేట్ ఎంచుకుని ఆ దిశగా ప్రమోషన్లు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు.
ముందుగా థియేటర్లలో అభిమానులు, మీడియా వాళ్లకు త్రీడీలో ట్రైలర్ ప్రదర్శించారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ట్రైలర్ వదిలారు. ఇప్పుడు ఫీడ్ బ్యాక్ ఎలా ఉంటుందా అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. సందేహం లేదు. టీజర్ చూసినపుడు కలిగిన నెగెటివ్ ఫీలింగ్ ఇప్పుడు ఎవరికీ కలగట్లేదు. టీజర్‌తో పోలిస్తే ట్రైలర్ చాలా చాలా బెటర్‌గా అనిపించింది. విజువల్ ఎఫెక్ట్స్ మెరుగుపడ్డాయి. కృత్రిమత్వం పోయింది. ఇప్పుడు నిజంగా రామాయణ గాథ చూస్తున్న ఫీలింగ్ కలిగింది జనాలకు. ఇందులోనూ ఎఫెక్ట్స్ ఓవర్ ద టాప్ అన్నట్లు ఉన్నప్పటికీ.. మరీ ఎబ్బెట్టుగా అయితే లేవు.
రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ గెటప్ మీద తీవ్ర అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో ట్రైలర్‌లో అతడికి ప్రాధాన్యమే ఇవ్వలేదు. ఊరికే అలా పైపైన చూపించి వదిలేశారు. మొత్తానికి ట్రైలర్ చూసి ఆహా ఓహో అనకపోయినా.. టీజర్ చూసినపుడు ట్రోల్ చేసినట్లు చేయకపోవడమే టీం సాధించిన పెద్ద సక్సెస్. ఇక ఏ భయాలు లేకుండా సినిమాను రిలీజ్ చేసుకోవచ్చు.
This post was last modified on May 10, 2023 7:42 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…